టీమిండియా హోం సీజన్ షెడ్యూల్ రిలీజ్

by Harish |   (  Updated:2026-03-26 18:51:27  IST  )

టీమిండియా హోం సీజన్ షెడ్యూల్ రిలీజ్
X

దిశ, స్పోర్ట్స్ : భారత జట్టు 2026-27‌కు సంబంధించిన హోం సీజన్ షెడ్యూల్‌ను బీసీసీఐ గురువారం ప్రకటించింది. సెప్టెంబర్ 27 నుంచి ఈ హోం సీజన్ ప్రారంభమై వచ్చే ఏడాది మార్చి 3తో ముగియనుంది. ప్రస్తుతం భారత ప్లేయర్లు ఐపీఎల్ బిజీలో ఉన్నారు. భారత ప్రీమియర్ లీగ్ ముగియగానే అఫ్గానిస్తాన్, ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలతో టీమిండియా షెడ్యూల్‌ తీరిక లేకుండా ఉంది. అయితే, ఇంగ్లాండ్ టూరు ముగిశాక దాదాపు రెండు నెలల విశ్రాంతి ఉంది. ఆ తర్వాత హోం సీజన్ మొదలవుతుంది. వెస్టిండీస్, శ్రీలంక, జింబాబ్వే, ఆస్ట్రేలియా జట్లు భారత్‌కు రానున్నాయి. వెస్టిండీస్‌ వన్డే సిరీస్‌తో సిరీస్‌తో స్వదేశీ సీజన్ షురూ కానుంది. మొత్తం 17 నగరాల్లో 22 మ్యాచ్‌లు జరగనున్నాయి. రెండు గేములకు హైదరాబాద్ ఆతిథ్యమివ్వనుంది. అక్టోబర్‌ 14న వెస్టిండీస్‌తో 4వ టీ20, వచ్చే ఏడాది జనవరి 6న జింబాబ్వేతో రెండో వన్డే ఉప్పల్ స్టేడియంలో జరగనున్నాయి.

జింబాబ్వే vs భారత్

27-9-26 తొలి వన్డే త్రివేండ్రం

30-9-26 రెండో వన్డే గువహతి

3-10-26 మూడో వన్డే న్యూచండీఘడ్

6-10-26 తొలి టీ20 లక్నో

9-10-26 రెండో టీ20 రాంచీ

11-10-26 మూడో టీ20 ఇండోర్

14-10-26 నాలుగో టీ20 హైదరాబాద్

17-10-26 ఐదో టీ20 బెంగళూరు

శ్రీలంక VS భారత్

13-12-26 తొలి వన్డే ఢిల్లీ

16-12-26 రెండో వన్డే బెంగళూరు

19-12-26 మూడో వన్డే అహ్మదాబాద్

22-12-26 తొలి టీ20 రాజ్‌కోట్

24-12-26 రెండో టీ20 కటక్

27-12-26 మూడో టీ20 పుణె

జింబాబ్వే VS భారత్

3-1-27 తొలి వన్డే కోల్‌కతా

6-1-27 రెండో వన్డే హైదరాబాద్

9-1-27 మూడో వన్డే ముంబై

ఆస్ట్రేలియా VS భారత్

21-1-27 తొలి టెస్టు నాగ్‌పూర్

29-1-27 రెండో టెస్టు చెన్నయ్

11-2-27 మూడో టెస్టు గువహతి

19-2-27 నాలుగో టెస్టు రాంచీ

27-2-27 ఐదో టెస్టు అహ్మదాబాద్

Next Story