- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఐపీఎల్ వేలంపై ఊతప్ప కీలక వ్యాఖ్యలు.. ఆక్షన్ ఆపేయాలంటూ కామెంట్స్
ఐపీఎల్-2026 వేలానికి ముందు భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప కీలక వ్యాఖ్యలు చేశాడు.

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-2026 వేలానికి ముందు భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప కీలక వ్యాఖ్యలు చేశాడు. తాజాగా తన యూట్యూబ్ చానెల్‌లో ఊతప్ప మాట్లాడుతూ.. ఐపీఎల్ వేలం ప్రక్రియను తొలగించాలన్నాడు. ఏడాది పొడవునా ప్లేయర్ల ట్రేడ్ అందుబాటులో ఉంచాలని, దానికి అనుగుణంగా డ్రాఫ్ట్ సిస్టమ్‌ను తీసుకరావాలని అభిప్రాయపడ్డాడు. అంతేకాకుండా, ఐపీఎల్‌ను ఆరు నెలలపాటు నిర్వహించాలని బీసీసీఐకి సూచించాడు. ‘ఐపీఎల్‌ను స్టార్టప్ దశకు మించి తీసుకెళ్లకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. వరల్డ్‌లోనే ఐపీఎల్ లీడింగ్ లీగ్. ఇప్పటికైనా మారండి. వేలాన్ని ఆపి ఏడాది పొడవునా ట్రేడ్ విండోను ఓపెన్‌గా ఉంచండి. ఆక్షన్ ప్రక్రియను వదలించుకోండి. డ్రాఫ్ట్ వ్యవస్థను తీసుకరండి. నేను ఆడేటప్పటి నుంచి ఇదే చెబుతున్నా. వారు టీవీ ఎంటర్‌టైన్‌మెంట్ మైండ్‌సెట్ నుంచి బయటకు రాలేకపోతున్నారు. డ్రాఫ్ట్ కూడా గొప్పగానే ఉండొచ్చు. ఐపీఎల్ ఆరు నెలల లీగ్ ఉండాలనేది నా ఆలోచన. మధ్యలో అంతర్జాతీయ మ్యాచ్‌లు ఉంటాయి. కానీ, ఐపీఎల్ అభివృద్ధి చెందాలి.’అని ఊతప్ప చెప్పుకొచ్చాడు.






