కోహ్లీ-రోహిత్ ఫ్యూచర్‌పై బీసీసీఐ ఫోకస్.. కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వాల్సిందే!

by Phanindra |

కోహ్లీ-రోహిత్ ఫ్యూచర్‌పై బీసీసీఐ ఫోకస్ పెట్టనుంది. కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వాల్సిందేనని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

కోహ్లీ-రోహిత్ ఫ్యూచర్‌పై బీసీసీఐ ఫోకస్.. కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వాల్సిందే!
X

దిశ, స్పోర్ట్స్: టీమిండియా దిగ్గజాలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వన్డే భవితవ్యంపై త్వరలోనే బీసీసీఐ ఒక నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటికే టీ20, టెస్టులకు వీడ్కోలు పలికిన ఈ ఇద్దరు లెజెండ్స్.. 2027 వన్డే వరల్డ్ కప్ ఆడతారా? లేదా? అనే అనుమానాలున్నాయి. ఇప్పటికే కోహ్లీకి 36 ఏళ్లు, రోహిత్‌కు 38 ఏళ్ల వయసుంది. 2027కు వీళ్లిద్దరూ కూడా 40 ఏళ్లకు దగ్గరపడతారు. ఈ ఏడాది ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీసులు ఆడనున్న కోహ్లీ, రోహిత్.. 2026లో న్యూజిల్యాండ్, ఇంగ్లండ్‌తో కూడా వన్డేలు ఆడనున్నారు.

ఈ 12 మ్యాచుల ప్రాక్టీస్‌తో వన్డే వరల్డ్ కప్ ఆడేందుకు సన్నాహకాలు సరిపోతాయా? అనేది ఒక ప్రశ్న. అలాగే అప్పటి వరకు వీళ్లిద్దరూ వన్డేలు ఆడతారా? అనేది మరో ప్రశ్న. ఈ క్రమంలోనే త్వరలోనే ఈ విషయంపై చర్చిస్తామని బీసీసీఐ వర్గాలు చెప్తున్నాయి. ‘వన్డే వరల్డ్ కప్‌కు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. అప్పటికి కోహ్లీ, రోహిత్ ఇద్దరూ 40 ఏళ్లకు దగ్గరపడతారు. కాబట్టి ఈ వరల్డ్ కప్ కోసం స్పష్టమైన ప్లాన్ అవసరం.

వీళ్లిద్దరూ ఆడకపోతే కొత్త కుర్రాళ్లకు అవకాశాలు ఇవ్వాలి’ అని వారంటున్నారు. అయితే కోహ్లీ, రోహిత్‌పై రిటైర్ అవ్వాలని ఎవరూ ఒత్తిడి తీసుకురారని, కానీ వారితో నిజాయితీగా వారితో చర్చిస్తామని వివరించారు. వచ్చే వన్డే సైకిల్ మొదలయ్యే ముందే దీనిపై చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Next Story