- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వర్క్‌లోడ్ సాకులు కుదరవు.. త్వరలోనే గంభీర్, అగార్కర్, బీసీసీఐ నిర్ణయం!
ఇకపై ప్లేయర్లు వర్క్‌లోడ్ సాకులు చూపించి కీలకమైన మ్యాచుల నుంచి తప్పుకోవడం కుదరదు. ఈ అంశంపై గంభీర్, అగార్కర్, బీసీసీఐ త్వరలోనే నిర్ణయం తీసుకోనుందట.

దిశ, స్పోర్ట్స్: వర్క్‌లోడ్ కారణంగా చూపించి కేవలం కొన్ని మ్యాచులు, సిరీసులు మాత్రమే ఆడటం ప్లేయర్లకు ఇకపై కుదరదు. ఈ విషయంపై టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ తదితరులు ఒక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. జట్టులో స్టార్ కల్చర్ ఉండటం కరెక్ట్ కాదని గంభీర్ ఎప్పటి నుంచో చెప్తున్న సంగతి తెలిసిందే. ఇక వర్క్‌లోడ్ గురించి ఉన్న సమస్యలకు కూడా మహమ్మద్ సిరాజ్ గట్టి సమాధానం ఇచ్చినట్లే కనిపిస్తోంది.
ఇంగ్లండ్‌లో ఐదు టెస్టుల్లో ఏమాత్రం విరామం లేకుండా సుదీర్ఘ స్పెల్స్ వేసిన సిరాజ్.. కీలక సమయాల్లో తన ఎనర్జీతో అందర్నీ ఆకట్టుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ‘వర్క్‌లోడ్’ సాకులకు ఫుల్‌స్టాప్ పెట్టాలని బీసీసీఐ భావిస్తోందట. అయితే వర్క్‌లోడ్ సమస్యను పూర్తిగా పక్కన పెట్టడం లేదని బీసీసీఐ వర్గాలంటున్నాయి. ‘సెంట్రల్ కాంట్రాక్ట్ ప్లేయర్లందరూ, ముఖ్యంగా అన్ని ఫార్మాట్లూ ఆడే ప్లేయర్లు.. తాము ఏ మ్యాచులు, సిరీసులు ఆడాలని పిక్ చేసుకోవడం కుదరదు.
ఫ్యూచర్‌లో ఇలాంటి విధానాన్ని ఏమాత్రం సహించబోం. అయితే వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌ను పట్టించుకోబోమని కాదు. దీనిపై ప్రత్యేకంగా ఫోకస్ పెడతాం. ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్ల వర్క్‌లోడ్ మేనేజ్ చేయడం ప్రధానం. అయితే ఈ కారణం చూపించి కీలకమైన మ్యాచులను మిస్ అవడం కరెక్ట్ కాదు’ అని బీసీసీఐ వర్గాలు చెప్తున్నాయి.






