బీసీసీఐ అత్య‌వ‌స‌ర మీటింగ్‌..గంభీర్ రాజీనామా ?

by velandi.Saikiran |

హెడ్ కోచ్ ప‌ద‌వికి గౌతమ్ గంభీర్ రాజీనామా చేస్తే, అతని స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్ బాధ్యతలు తీసుకునే అవకాశాలు

బీసీసీఐ అత్య‌వ‌స‌ర మీటింగ్‌..గంభీర్ రాజీనామా ?
X

దిశ‌, వెబ్ డెస్క్‌: భార‌త జ‌ట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కు బిగ్ షాక్ తగిలినట్లు తెలుస్తోంది. అతన్ని తప్పించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి నిర్ణయం తీసుకున్నట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే నవంబర్ 30వ తేదీన బీసీసీఐ పెద్దలు అత్యవసరంగా సమావేశం కాబోతున్నారట. స్వదేశంలో వరుసగా భార‌త జ‌ట్టు, సిరీస్ లు కోల్పోతున్న నేపథ్యంలో హెడ్ కోచ్‌ గౌతమ్ గంభీర్ పై వేటు వేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం.

భార‌త జ‌ట్టు బ్యాటింగ్ లైనప్ మార్చడం, అనవసర ప్రయోగాలు చేయడం, హర్షిత్ రాణా లాంటి ప్లేయర్లకు ఎక్కువగా అవకాశాలు ఇవ్వడంపై బీసీసీఐకి చాలా ఫిర్యాదులు వెళ్లాయట. దీంతో గౌతమ్ గంభీర్ పై వేటు వేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. నవంబర్ 30వ తేదీన గంభీర్ భవిష్యత్తుపై బీసీసీఐ నిర్ణయం తీసుకుంటుందని చెబుతున్నారు. అతని చేత రాజీనామా చేయించి, కొత్త కోచ్ ను నియామకం చేసే యోచ‌నలో బీసీసీఐ పెద్ద‌లు ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ భార‌త జ‌ట్టు హెడ్ కోచ్ ప‌ద‌వికి గౌతమ్ గంభీర్ రాజీనామా చేస్తే, అతని స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్ బాధ్యతలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Next Story