- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీసీసీఐ జాతీయ సెలెక్టర్ల పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం
జాతీయ సెలెక్టర్ల పోస్టులకు బీసీసీఐ దరఖాస్తులు ఆహ్వానించింది.

దిశ, స్పోర్ట్స్ : భారత సీనియర్ పురుషుల, సీనియర్ మహిళల, జూనియర్ పురుషుల సెలెక్షన్ కమిటీలలో ఖాళీగా ఉన్న జాతీయ సెలెక్టర్ల పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు బీసీసీఐ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. సీనియర్ పురుషుల సెలెక్షన్ కమిటీలో రెండు పొజిషన్స్ ఖాళీగా ఉన్నాయని తెలిపింది. 7 టెస్టులు లేదా 30 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు, లేదా 10 వన్డేలతోపాటు 20 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన వారు అర్హులని పేర్కొంది. సీనియర్ మహిళల సెలెక్షన్ కమిటీలో నలుగురు జాతీయ సెలెక్టర్లకు దరఖాస్తులు ఆహ్వానించింది. దరఖాస్తు చేసే వారు కచ్చితంగా భారత మహిళల జట్టుకు ప్రాతినిధ్యం వహించిన మాజీ క్రీడాకారిణులే అర్హులని పేర్కొంది. అలాగే, జూనియర్ సెలెక్షన్ కమిటీలో ఒక్క జాతీయ సెలెక్టర్ స్థానానికి 25 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన మాజీ ప్లేయర్లు అప్లై చేసుకోవచ్చని తెలిపింది. పై స్థానాలకు దరఖాస్తు చేసుకునే వారు ఐదేళ్ల క్రితమే రిటైర్ అయ్యి ఉండాలని, ఐదేళ్ల కాలంలో ఏ బీసీసీఐ క్రికెటీలోనూ సభ్యుడిగా ఉండొద్దని తెలిపింది. దరఖాస్తులకు వచ్చే నెల 10 తుది గడువు.
- Tags
- BCCI






