- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
14న బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశం.. కీలక నిర్ణయాలు తీసుకునే చాన్స్!
by Kema Shiva Kumar |
బెంగళూరు (Bengaluru) చిన్నస్వామి స్టేడియం (Chinna Swamy Stadium) వద్ద ఆర్సీబీ విజయోత్సవ వేడుకల సందర్భంగా తొక్కిసలాట నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఈనెల 14న అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించనుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: బెంగళూరు (Bengaluru) చిన్నస్వామి స్టేడియం (Chinna Swamy Stadium) వద్ద ఆర్సీబీ విజయోత్సవ వేడుకల సందర్భంగా తొక్కిసలాట నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఈనెల 14న అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశంలో జట్లు తమ సంబంధిత పోటీల్లో టైటిల్ గెలిచిన తర్వాత జరిగే విజయోత్సవాలకు సంబంధించి సరికొత్త నియమ నిబంధనలు, మార్గదర్శకలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. అయితే, ఈ సమావేశాన్ని వర్చువల్‌గా నిర్వహించే అవకాశం ఉందని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. కాగా, చిన్నస్వామి తొక్కిసలాట (Stampede)లో 11 మంది మరణించగా.. 50 మందికిపైగా గాయాలయ్యాయి. ఈ ఘటనపై సుమోటోగా స్వీకరించిన కర్ణాటక న్యాయస్థానం విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే.
Next Story






