రోహిత్, కోహ్లీలకు డిమోషన్‌.. BCCI అధికారిక ప్రకటన

by Gantepaka Srikanth |

భారత క్రికెట్ ఆటగాళ్ల ఒప్పంద జాబితాను బీసీసీఐ ప్రకటించింది.

రోహిత్, కోహ్లీలకు డిమోషన్‌.. BCCI అధికారిక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: భారత క్రికెట్ ఆటగాళ్ల ఒప్పంద జాబితాను బీసీసీఐ(BCCI) ప్రకటించింది. గ్రేడ్-ఏలో శుభ్‌మన్ గిల్, జస్ప్రీత్ బూమ్రా, రవీంద్ర జడేజా, గ్రేడ్-బీలో రోహిత్ శర్మ(Rohit Sharma), విరాట్ కోహ్లీ(Virat Kohli), కేఎల్ రాహుల్, మహ్మద్ సిరాజ్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్, యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, గ్రేడ్‌-సీలో అక్షర్‌ పటేల్‌, తిలక్‌ వర్మ, రింకు సింగ్‌ సహా 16 మందిని ఎంపిక చేసింది. అయితే ఇంతకాలం గ్రేడ్‌-ఏలో ఉన్న మాజీ కెప్టెన్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతోపాటు మరో తొమ్మిది మందిని ‘గ్రేడ్‌-బీ’లో చేర్చింది. దీంతో వారి ఫ్యాన్స్ షాక్‌లో ఉన్నారు. వచ్చే వన్డే వరల్డ్‌కప్‌ వరకు వీరు ఉంటారా? ఉండరా? అనే అనుమానాలు మొదలయ్యాయి.

కారణం ఇదే...

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను గ్రూప్-బీకి తగ్గించడానికి ప్రధాన కారణం వారు ప్రస్తుతం పరిమిత ఫార్మాట్లకే పరిమితం కావడమని సమాచారం. ఈ ఇద్దరు దిగ్గజాలు ఇప్పటికే టీ20 అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు టెస్ట్ క్రికెట్ నుండి కూడా వైదొలిగారు. ప్రస్తుతం వీరు కేవలం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బీసీసీఐ నిబంధనల ప్రకారం, అన్ని ఫార్మాట్లు ఆడే కీలక ఆటగాళ్లకే గ్రేడ్-ఏలో చోటు దక్కుతుంది. అందుకే కేవలం ఒకే ఫార్మాట్ ఆడుతున్న రోహిత్, కోహ్లీలను గ్రూప్-బీకి కేటాయించారు.

Next Story