- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారత్, పాక్ మ్యాచ్‌పై గవాస్కర్ కీలక వ్యాఖ్యలు.. వాళ్ల చేతుల్లో ఏం లేదంటూ కామెంట్స్
ఆసియా కప్‌లో భాగంగా సెప్టెంబర్ 14న భారత్, పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంది.

దిశ, స్పోర్ట్స్ : ఆసియా కప్‌లో భాగంగా సెప్టెంబర్ 14న భారత్, పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌ను బహిష్కరించాలన్న డిమాండ్ వ్యక్తమవుతున్న నేపథ్యంలో భారత్, పాక్ పోరు జరగడంపై అనుమానాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత ప్లేయర్లను లక్ష్యంగా చేసుకుని విమర్శించొద్దని అభిమానులను కోరాడు. ఆటగాళ్ల చేతుల్లో ఏం లేదని, భారత ప్రభుత్వ ఆదేశాలనే వాళ్లు పాటిస్తారని చెప్పాడు. ‘వాళ్లు ఆసియా కప్‌కు ఎంపికయ్యారు. మీరు ఆడాలని ప్రభుత్వం చెపితే ఆడతారు. వద్దంటే ఆడరు. ఈ విషయంలో ప్లేయర్లు నిస్సహాయులు. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఆటగాళ్లను విమర్శించడం సరికాదు. ప్లేయర్లు బీసీసీఐతో సెంట్రల్ కాంట్రాక్ట్‌ను కలిగి ఉంటారు. బీసీసీఐ ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తుంది. కాబట్టి, ఇదంతా కేంద్రంపై ఆధారపడి ఉంటుంది. బీసీసీఐ ఏం చేయాలే ప్రభుత్వమే చెప్పాలి.’అని గవాస్కర్ చెప్పుకొచ్చాడు. కాగా, సెప్టెంబర్ 10 నుంచి ఆసియా కప్ మొదలుకానుంది. సూర్యకుమార్ నాయకత్వంలో బీసీసీఐ భారత జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే.






