క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన బంగ్లా ఆల్‌రౌండర్

by Ajay Maddhiboyina |

మహ్మదుల్లా 50 టెస్టుల్లో 2,919 పరుగులు చేశాడు. అలాగే 43 వికెట్లు పడగొట్టాడు. 239 వన్డేల్లో 5,689 పరుగులు, 82 వికెట్లు సాధించాడు. 141 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లలో 2,444 పరుగులు, 41 వికెట్లు తీశాడు.

క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన బంగ్లా ఆల్‌రౌండర్
X

- వన్డే క్రికెట్ నుంచి నిష్క్రమణ

- చాంపియన్స్ ట్రోఫీలో కివీస్‌తో చివరి మ్యాచ్

దిశ, స్పోర్ట్స్: బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు ఆల్‌రౌండర్ మహ్మద్ మహ్మదుల్లా అంతర్జాతీయ వన్డేలకు గుడ్ బై చెప్పాడు. చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా న్యూజీలాండ్‌తో జరిగిన లీగ్ మ్యాచే తన చివరి వన్డేగా మహ్మదుల్లా సోషల్ మీడియాలో ప్రకటించాడు. 2021లో టెస్టులకు, 2024లో టీ20 క్రికెట్‌కు వీడ్కోలు పలికిన మహ్మదుల్లా తాజాగా వన్డేల నుంచి కూడా తప్పకుంటున్నట్లు తెలిపాడు. 17 ఏళ్ల పాటు సుదీర్ఘంగా బంగ్లా జట్టుకు ప్రాతినిథ్యం వహించిన మహ్మదుల్లా.. టీ20 జట్టు కెప్టెన్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తించాడు. ఈ సందర్భంగా తన టీమ్ మేట్స్, కోచ్‌లు, అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు. తన తల్లిదండ్రులు, అత్తమామలు, ముఖ్యంగా తన సోదరుడు ఇమాద్ ఉల్లాకు కృతజ్ఞతలు తెలిపాడు. తన చిన్నప్పటి నుంచి కోచ్‌గా, మెంటార్‌గా తనకు అండగా ఉన్న ఇమాద్‌ఉల్లాకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపాడు. కాగా, మూడు వన్డే వరల్డ్ కప్‌లలో మూడు సెంచరీలు చేసిన ఏకైక బంగ్లా బ్యాటర్ మహ్మదుల్లానే కావడం గమనార్హం. 2015లో ఇంట్లాండ్, న్యూజీలాండ్‌పై.. 2023లో సౌత్ ఆఫ్రికాపై మహ్మదుల్లా సెంచరీలు చేశాడు. మహ్మదుల్లా 50 టెస్టుల్లో 2,919 పరుగులు చేశాడు. అలాగే 43 వికెట్లు పడగొట్టాడు. 239 వన్డేల్లో 5,689 పరుగులు, 82 వికెట్లు సాధించాడు. 141 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లలో 2,444 పరుగులు, 41 వికెట్లు తీశాడు.

Next Story