- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బంగ్లాదేశ్ మళ్లీ యూటర్న్.. ప్లేయర్లు కాదు.. ప్రభుత్వమే భారత్‌కు పంపలేదట!
బంగ్లాదేశ్ మళ్లీ యూటర్న్ తీసుకుంది. భారత్‌కు ప్లేయర్లను ఆ దేశ ప్రభుత్వమే పంపలేదని ప్రకటించింది.

దిశ, స్పోర్ట్స్: టీ20 వరల్డ్ కప్ నుంచి తప్పుకోవడంపై బంగ్లాదేశ్ మరోసారి మాట మార్చింది. ఈ మెగా టోర్నీని బాయ్‌కాట్ చేయాలని, భారత్‌కు వెళ్లకూడదని ప్లేయర్లు, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) నిర్ణయం తీసుకున్నాయని ఇటీవలే ఆ దేశ స్పోర్ట్స్ అడ్వైజర్ ఆసిఫ్ నజ్రుల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతకుముందు ప్రభుత్వమే ఈ నిర్ణయం తీసుకుందని ఆయన చెప్పారు. అలాంటిది సడెన్‌గా ప్లేయర్లను బ్లేమ్ చేయడంతో అంతా ఆశ్చర్యపోయారు. దీనిపై మరోసారి స్పందించిన ఆయన.. ‘కాదు కాదు.. ప్రభుత్వమే ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని నేను బల్లగుద్ది మరీ చెప్తున్నా’ అని ప్రకటించారు. మంగళవారం నాడు విలేకరులతో మాట్లాడుతుండగా.. ప్రిపేర్ అవ్వని సందర్భంలో తను మాట తూలానని, ఆ మాటలను అపార్థం చేసుకున్నారని నజ్రుల్ వివరణ ఇచ్చారు. ఇలా అతను ఇన్నిసార్లు మాట మార్చడంతో టీ20 వరల్డ్ కప్ కోసం భారత్‌కు రాకూడదన్న నిర్ణయం ఎవరు తీసుకున్నారో అర్థం కాకుండా పోయింది.






