సముద్రం ఎరుపెక్కుతోంది..RCB విజయం పై టాలీవుడ్ నటి సంచలన పోస్ట్ !

by velandi.Saikiran |

ఐపీఎల్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో.. శనివారం రోజున రాయల్ చాలెంజర్స్ బెంగళూరు గ్రాండ్ విక్టరీ కొట్టింది. చెన్నై సూపర్ కింగ్

సముద్రం ఎరుపెక్కుతోంది..RCB విజయం పై టాలీవుడ్ నటి సంచలన పోస్ట్ !
X

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో.. శనివారం రోజున రాయల్ చాలెంజర్స్ బెంగళూరు గ్రాండ్ విక్టరీ కొట్టింది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టును చిన్నస్వామి స్టేడియంలో ఉతికి ఆరేసింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. దీంతో.. దాదాపుగా ప్లే ఆఫ్ కు వెళ్ళింది బెంగళూరు. అయితే... ఈ మ్యాచ్ నేపథ్యంలో టాలీవుడ్ నటి సుప్రీత ఆసక్తికర పోస్ట్ పెట్టింది.

మ్యాచ్ చిన్నస్వామి స్టేడియంలో జరగడంతో... టాలీవుడ్ నటి సుప్రీత కూడా హాజరైంది. ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ జెర్సీ వేసుకొని ఎంజాయ్ చేసింది. అలాగే బెంగళూరు జెండాలు పట్టుకొని.. ఎంకరేజ్ చేసింది టాలీవుడ్ నటి సుప్రీత. అయితే మ్యాచ్ అనంతరం... కోహ్లీ టీం ను మెచ్చుకుంటూ పోస్ట్ పెట్టింది. సముద్రం ఎరుపెక్కుతోంది.. అంటూ అదిరిపోయే డైలాగ్ రాసుకొచ్చింది. అదే సమయంలో విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ అలాగే బ్యాటింగ్ చేస్తున్న వీడియోను కూడా... సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ఇక నటి సుప్రీత చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో... క్రికెట్ అభిమానులు పాజిటివ్ గా రెస్పాండ్ అవుతున్నారు. ఇన్నాళ్లకు హాట్ అందాలు కాకుండా ఓ మంచి సబ్జెక్టును సోషల్ మీడియాలో సుప్రీత పంచుకుందని కొంతమంది మెచ్చుకుంటున్నారు. విరాట్ కోహ్లీ ఎక్కడ మ్యాచ్ అడిగిన కచ్చితంగా సుప్రీత అటెండ్ అవుతుందని... ఆమెకు కోహ్లీ అంటే చాలా ఇష్టమని మరి కొంతమంది అంటున్నారు.

Next Story