ఏఐఎఫ్ఎఫ్ ప్రక్షాళన జరగాలి.. కెప్టెన్ బైచుంగ్ భుటియా ఆగ్రహం!

by Phanindra |   (  Updated:2025-06-13 15:25:31  IST  )

ఆసియా కప్‌కు అర్హత సాధించేందుకు భారత ఫుట్‌బాల్ జట్టు కష్టపడటంపై మాజీ కెప్టెన్ బైచుంగ్ భుటియా ఆవేదన వ్యక్తంచేశాడు. ఏఐఎఫ్ఎఫ్ ప్రక్షాళన జరగాలని డిమాండ్ చేశాడు.

ఏఐఎఫ్ఎఫ్ ప్రక్షాళన జరగాలి.. కెప్టెన్ బైచుంగ్ భుటియా ఆగ్రహం!
X

దిశ, స్పోర్ట్స్: ఆలిండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్) ప్రెసిడెంట్ కల్యాన్ చౌబే.. దేశంలో ఆటను నాశనం చేశాడని భారత జట్టు మాజీ కెప్టెన్ బైచుంగ్ భుటియా మండిపడ్డాడు. ఏఎఫ్‌సీ ఏసియన్ కప్ క్వాలిఫైయర్స్‌లో భారత జట్టు ఘోరంగా ఆడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఏఐఎఫ్ఎఫ్, దాని ప్రెసిడెంట్ కల్యాణ్‌పై భుటియా ఆగ్రహం వ్యక్తంచేశారు. దేశంలో ఫుట్‌బాల్‌ను బాగు చేయాలంటే ఈ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్నాడు.

‘ఆసియా కప్‌ అర్హత సాధించడానికి కూడా మనం ఇంత ఇబ్బంది పడుతుండటం చూస్తుంటే చాలా బాధగా ఉంది. ఇంతకాలం రెగ్యులర్‌గా ఆసియా కప్‌లో మనం ఆడాం కదా’ అని భుటియా అన్నారు. అలాగే ఉజ్బెకిస్తాన్, ఇండోనేషియా, జోర్డాన్ వంటి దేశాలు కూడా వరల్డ్ కప్‌లో ఆడేందుకు అర్హత సాధిస్తున్నాయని, కానీ ఆసియా కప్‌కు అర్హత సాధించేందుకు కూడా భారత్ కష్టపడుతోందని విమర్శించాడు.

ఇండియన్ ఫుట్‌బాల్‌ను కల్యాణ్ సర్వనాశనం చేశాడని, ఆయన వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశాడు. 2022లో జరిగిన ఏఐఎఫ్ఎఫ్ ఎన్నికల్లో కల్యాణ్ చేతుల్లో భుటియా ఓడిపోయిన సంగతి తెలిసిందే. గత రెండేళ్లలో ఏఐఎఫ్ఎఫ్‌లో ముగ్గురు సెక్రటరీలు మారిన విషయాన్ని కూడా భుటియా గుర్తుచేశారు.

Next Story