- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
దిశ, వెబ్‌డెస్క్: ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత డబుల్స్ జోడి చరిత్ర సృష్టించారు. భారత డబుల్స్ జోడి సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ఫైనల్లోకి ప్రవేశించింది. దీంతో ఈ ఘనత సాధించిన తొలి భారత జంటగా నిలిచారు. శనివారం జరిగిన సెమీస్‌లో ఆరో సిడ్ సాత్విక్–చిరాగ్.. చైనీస్ తైపీకి చెందిన లీ యాంగ్–వాంగ్ చిన్ లిన్‌పై విజయం సాధించారు. తొలి గేమ్‌ను 21–18తో గెలుచుకున్నగా.. రెండో గేమ్‌లో 13–14తో వెనుకబడి ఉన్న దశలో వాంగ్ చిన్ లిన్ గాయం కారణంగా తప్పుకున్నాడు. దీంతో ‘వాకోవర్’తో మన ఆటగాళ్లు ముందంజ వేశారు. 41 నిమిషాల్లో ఈ మ్యాచ్ ముగిసింది. నేడు జరిగే ఫైనల్లో ఎనిమిదో సీడ్ ఆంగ్ యూ సిన్ – టియో ఈ యీ (మలేసియా)తో భారత జోడి తలపడుతుంది.
Next Story






