- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆసియా చాంపియన్‌షిప్‌లో సింధు శుభారంభం
ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌లో భారత స్టార్ క్రీడాకారిణి పీవీ సింధు శుభారంభం చేసింది.

దిశ, స్పోర్ట్స్ : చైనాలో జరుగుతున్న ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌లో భారత స్టార్ క్రీడాకారిణి పీవీ సింధు శుభారంభం చేసింది. తొలి రౌండ్‌లో నెగ్గి రెండో రౌండ్‌కు అర్హత సాధించింది. బుధవారం జరిగిన ఉమెన్స్ సింగిల్స్ తొలి రౌండ్‌లో సింధు 21-15, 21-19 తేడాతో ఇండోనేషియాకు చెందిన ఎస్టర్ నురుమి ట్రై వార్డోయోపై విజయం సాధించింది. ప్రత్యర్థి షట్లర్ నుంచి పోటీ ఎదురైనప్పటికీ సింధు ఆధిపత్యం ప్రదర్శిస్తూ రెండు గేముల్లోనే మ్యాచ్ సొంతం చేసుకుంది. రెండో రౌండ్‌లో ఆమె జపాన్ క్రీడాకారిణి యమగూచితో తలపడనుంది. మాళవిక బాన్సోద్, ఆకర్షి కశ్యప్ తొలి రౌండ్‌లోనే పరాజయం పాలై టోర్నీ నుంచి నిష్ర్కమించారు. మెన్స్ సింగిల్స్‌లో యువ షట్లర్లు ప్రియాన్స్ రజావత్, కిరణ్ జార్జ్ సత్తాచాటారు. తొలి రౌండ్‌లో కిరణ్ 21-16, 21-8 తేడాతో కజఖస్తాన్‌కు చెందిన డిమిత్రి పనారిన్‌పై.. ప్రియాన్ష్ 20-21, 21-12, 21-10 తేడాతో థాయిలాండ్ షట్లర్ వాంగ్చోరన్‌పై గెలుపొంది రెండో రౌండ్‌కు చేరుకున్నారు.మరోవైపు, స్టార్ ప్లేయర్లు లక్ష్యసేన్, హెచ్ఎస్ ప్రణయ్ తొలి రౌండ్‌లోనే ఓడిపోవడం గమనార్హం. చైనీస్ తైపీ ప్లేయర్ చియా హో లీ చేతిలో 21-18, 21-10 తేడాతో లక్ష్యసేన్ ఓడిపోగా.. ప్రణయ 16-21, 21-12, 11-21 తేడాతో చైనాకు చెందిన గువాంగ్ జు లీ చేతిలో ఓడి ఇంటిదారిపట్టారు.






