Badminton Asia Championships : సింధుకు షాక్.. పతకం లేకుండానే ఇంటికి

by Harish |

ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్స్‌లో భారత్‌కు షాక్ తగిలింది.

Badminton Asia Championships : సింధుకు షాక్.. పతకం లేకుండానే ఇంటికి
X

దిశ స్పోర్ట్స్ : చైనాలో జరుగుతున్న ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్స్‌లో భారత్‌కు షాక్ తగిలింది. సింగిల్స్‌లో పతక ఆశలు గల్లంతయ్యాయి. స్టార్ క్రీడాకారిణి పీవీ సింధుతోపాటు పలువురు షట్లర్లు ఇంటిదారిపట్టారు. టోర్నీలో శుభారంభం చేసిన సింధు రెండో రౌండ్‌లోనే నిష్ర్కమించింది. గురువారం జరిగిన ఉమెన్స్ సింగిల్స్ మ్యాచ్‌లో సింధు 11-21, 2-16, 16-21 తేడాతో జపాన్ క్రీడాకారిణి యమగూచి చేతిలో ఓడిపోయింది. తొలి గేమ్ కోల్పోయిన తర్వాత సింధు పుంజుకుని రెండో గేమ్ నెగ్గినా నిర్ణయాత్మక మూడో గేమ్‌లో మాత్రం ఆమెకు నిరాశ తప్పలేదు.

మెన్స్ సింగిల్స్‌లో యువ షట్లర్లు ప్రియాన్స్ రజావత్, కిరణ్ జార్జ్ ప్రయాణం కూడా ముగిసింది. రెండో రౌండ్‌లో రజావత్ 14-21 17-21 జపాన్ ఆటగాడు కొడై నారోకా చేతిలో ఓడగా.. థాయిలాండ్ ప్లేయర్ విటిద్సర్న్ చేతిలో కిరణ్ 21-19, 13-21, 16-21 తేడాతో చిత్తయ్యాడు. అయితే, మిక్స్‌డ్ డబుల్స్‌లో ధ్రువ్ కపిల-తనీషా క్రాస్టో జోడీ క్వార్టర్ ఫైనల్‌కు చేరుకోవడం భారత్‌కు కాస్త ఊరటనిచ్చే విషయం. రెండో రౌండ్‌లో ధ్రువ్-తనీషా జంట 12-21, 21-16, 21-18 తేడాతో చైనీస్ తైపీకి చెందిన హే హాంగ్ వీ-నికోల్ గొంజాలెస్ చాన్ జోడీపై విజయం సాధించి టోర్నీలో ముందడుగు వేసింది.


Next Story