- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. తొలి టెస్ట్‌కు వరుణ గండం
ఇంగ్లాండ్ (England)తో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా లీడ్స్ (Leads) వేదికగా తొలి టెస్ట్‌కు టీమిండియా (Team India) సన్నద్ధమైంది.

దిశ, వెబ్‌డెస్క్: ఇంగ్లాండ్ (England)తో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా లీడ్స్ (Leads) వేదికగా తొలి టెస్ట్‌కు టీమిండియా (Team India) సన్నద్ధమైంది. ఇదే సిరీస్‌తోనే డబ్ల్యూటీసీ-2027 (WTC-2027 ఎడిషన్‌కు తెర లేవనుంది. ఇవాళ మధ్యాహ్నం 3.30కి భారత కాలమానం ప్రకారం మ్యాచ్ ప్రారంభం కాబోతోంది. అయితే, రెడ్ బాల్ క్రికెట్‌కు అనుభవజ్ఞులైన విరాట్ కోహ్లీ (Virat Kohli), రోహిత్ శర్మ (Rohit Sharma) రిటైర్మెంట్ ప్రకటించడంతో ఇంగ్లాండ్‌పై భారత కుర్రాళ్లు అధిపత్యం ప్రదర్శిస్తారా.. లేక చేతులెత్తేస్తారా అన్న సందిగ్ధం అందరిలోనూ నెలకొంది. అదేవిధంగా కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ (Shubhman Gill)కు ఇదే మొదటి మ్యాచ్ కావడం విశేషం.
జట్టుకు సీనియర్లు దూరం అవ్వడంతో సెలక్టర్లు తుది జట్టులో ఇటీవల రంజీలతో పాటు ఐపీఎల్‌లో సత్తా చాటిన కరుణ్ నాయర్, అభిమన్యు ఈశ్వరన్, సాయి సుదర్శన్‌లకు చోటు కల్పించారు. తొలి టెస్ట్‌కు అంతా సిద్ధమని భావిస్తున్న తరుణంలో వర్షం అడ్డంకిగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం లీడ్స్‌లో ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉంది. ఇక వేళ వర్షం వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసే జట్టు సవాళ్లను ఎదుర్కోనుంది. తేమ కారణంగా పిచ్ పూర్తిగా బౌలర్లకు అనుకూలించే అవకాశం ఉందని తెలుస్తోంది. వాతావరణ శాఖ (Department of Meteorology) రిపోర్టు మేరకు తొలి టెస్ట్ రెండో, మూడో రోజు ఉదయం ఒక గంట పాటు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లుగా అధికారులు వెల్లడించారు.






