- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
బల్లెం వీరుడు నీరజ్ చోప్రాకు బ్యాడ్ న్యూస్..
దిశ, స్పోర్ట్స్ : విశ్వక్రీడల్లో వరుసగా రెండు మార్లు (టోక్యో, పారిస్) పతకాలతో మెరిసిన బల్లెం వీరుడు నీరజ్ చోప్రాకు ఊహించని షాక్ తగిలింది. రెండుసార్లు ఒలింపిక్స్ మెడల్స్ సాధించడంలో కీలక పాత్ర పోషించిన నీరజ్ కోచ్ క్లాస్ బార్టోనీఎట్జ్ కోచ్ పదవికి వీడ్కోలు పలికేందుకు సిద్ధమయ్యాడు. జర్మనీకి చెందిన క్లాస్ ఇకమీదట నీరజ్‌కు కోచింగ్ ఇవ్వలేనని స్పష్టం చేశాడు. 75 ఏళ్ల క్లాస్ తన విశ్రాంత జీవితాన్ని కుటుంబంతో గడిపేందుకు స్వదేశం వెళ్తున్నట్లు పేర్కొన్నాడు. దీంతో నీరజ్ చోప్రాకు కొత్త కోచ్ అవసరం ఏర్పడింది. చోప్రాను ప్రపంచ స్థాయి అథ్లెట్‌గా తీర్చిదిద్దిన క్లాసో 2021 తర్వాత కోచింగ్ ఇవ్వనని ముందే చెప్పాడని సమాచారం.
కానీ, భారత అథ్లెటిక్స్ సమాఖ్య విజ్ఞప్తి మేరకు మరో మూడేళ్లు కోచింగ్ ఇచ్చేందుకు ఓకే చెప్పారని మంగళవారం అథ్లెటిక్స్ సమాఖ్య చీఫ్ కోచ్ రాధాకృష్ణ నాయర్ వెల్లడించారు. ‘2021 తర్వాత నీరజ్‌కు శిక్షణ ఇచ్చేందుకు క్లాసో సిద్దంగా లేడు. అప్పుడు మేము ఆయన‌్నున బతిమిలాడాం. దాంతో, ఆయన కోచింగ్ కొనసాగించారు. కానీ, ఈసారి మాత్రం క్లాసో తన కాంట్రాక్ట్ పొడిగింపును కోరుకోవడం లేదు’ అని రాధాకృష్ణన్ తెలిపారు. పారిస్ ఒలింపిక్స్ ముందు భుజం హెర్నియాతో బాధ పడిన నీరజ్ నొప్పిని భరిస్తూనే బరిలోకి దిగి ఫైనల్లో 89.45 మీటర్ల దూరం బల్లెం విసిరి సిల్వర్ మెడల్‌తో చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే.