కేవ‌లం 11 ప‌రుగులు చేసి, రోహిత్‌, కోహ్లీ రికార్డులు బ‌ద్ద‌లు కొట్టిన బాబ‌ర్‌

by velandi.Saikiran |

అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ల‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల లిస్టులో బాబర్ ఆజం మొదటి స్థానాన్ని దక్కించుకున్నాడు.

కేవ‌లం 11 ప‌రుగులు చేసి, రోహిత్‌, కోహ్లీ రికార్డులు బ‌ద్ద‌లు కొట్టిన బాబ‌ర్‌
X

దిశ‌, వెబ్ డెస్క్‌: గత కొన్ని రోజులుగా పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజంపై దారుణంగా ట్రోలింగ్స్ వస్తున్నాయి. కెప్టెన్సీ కోల్పోవడం, బ్యాటింగ్ సరిగ్గా చేయకపోవడం, జట్టులోనే స్థానం కోల్పోవడం... అబ్బో ఇంకా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు బాబర్ ఆజం. అయితే అలాంటి బాబర్ ఆజం... తాజాగా సరికొత్త రికార్డు సృష్టించాడు. కేవలం 11 పరుగులు చేసి రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీని వెనక్కి నెట్టేసాడు బాబర్ ఆజం. అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ల‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల లిస్టులో బాబర్ ఆజం మొదటి స్థానాన్ని దక్కించుకున్నాడు.

మొన్నటి వరకు టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ మొదటి స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం దక్షిణాఫ్రికా వర్సెస్ పాకిస్తాన్ మధ్య టి20 సిరీస్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో నిన్న బ్యాటింగ్ చేసిన బాబర్ 11 పరుగులు చేసి, టి20ల‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా మొదటి స్థానాన్ని దక్కించుకున్నాడు. కేవలం 123 ఇన్నింగ్స్ లలో 4234 పరుగులు సాధించాడు బాబర్. ఆ తర్వాత 151 ఇన్నింగ్స్ లలో 4231 పరుగులు చేశాడు రోహిత్ శర్మ. 117 ఇన్నింగ్స్ లలో 4188 పరుగులు చేశాడు విరాట్ కోహ్లీ. ప్రస్తుతం ఈ ముగ్గురు వరుసగా లిస్టులో ఉన్నారు. అయితే రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ ఇద్దరూ టి20 క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ లెక్కన చూస్తే కొన్ని సంవత్సరాల వరకు బాబర్ ఆజం రికార్డును ఎవరు బ్రేక్ చేయలేరు అన్నమాట.

Next Story