- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, స్పోర్ట్స్ : కొత్త చరిత్ర సృష్టించే దిశగా సాగిన భారత యువ షట్లర్ ఆయుశ్ శెట్టి తుది మెట్టుపై బోల్తాపడ్డాడు. ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో మెన్స్ సింగిల్స్‌లో స్వర్ణ పతకం దగ్గరి వరకూ వచ్చి అందుకోలేకపోయాడు. చైనాలో జరిగిన టోర్నీలో అతను రజతంతో సరిపెట్టాడు. అయినప్పటికీ ఆయుశ్ తన ప్రదర్శనతో అభిమానుల మనసు గెలిచాడు. టోర్నీ ప్రారంభంలో ఆయుశ్ ఫైనల్ వరకూ వస్తాడని ఎవరూ ఊహించి ఉండరు. సింధు, లక్ష్యసేన్, హెచ్‌ఎస్ ప్రణయ్‌పైనే అంచనాలు ఉండేవి. కానీ, వారు రెండో రౌండ్ కూడా దాటలేకపోయారు. ఆయుశ్ మాత్రం సంచలన ప్రదర్శన చేశాడు. సెమీస్ వరకూ అతను ఎదుర్కొన్న ప్రత్యర్థుల్లో ముగ్గురు టాప్-10 ర్యాంకర్లే కావడం గమనార్హం.
సెమీస్‌లో ఏకంగా వరల్డ్ నం.1 ఆటగాడికి షాకిచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఆయుశ్ బంగారు పతకం సాధిస్తాడన్న విశ్వాసం బలపడింది. కానీ, టైటిల్ పోరు అతనికి అంత సులువుగా సాగలేదు. చైనాకు చెందిన షి యు కి దూకుడు ముందు ఆయుశ్ నిలువలేకపోయాడు. వరుసగా 8-21, 10-21తో మ్యాచ్‌ను కోల్పోయాడు. తొలి గేములో పూర్తిగా చైనా ప్లేయర్ హవానే కొనసాగగా.. రెండో గేములో ఒక దశలో ఆయుశ్ లీడ్‌లో కొనసాగాడు. 7-2తో ఆధిక్యంలో నిలిచాడు. కానీ, ప్రత్యర్థి పుంజుకోవడంతో తడబడిన అతను మళ్లీ నిలబడలేకపోయాడు. దీంతో ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో రజతం సాధించిన ఏకైక భారత ప్లేయర్‌గా నిలిచాడు. దీంతో 8 ఏళ్ల తర్వాత సింగిల్స్‌లో భారత్‌కు పతకం దక్కింది. 2018లో హెచ్ఎస్ ప్రణయ్ కాంస్యం సాధించాడు. కానీ, 1965లో దినేశ్ ఖన్నా గోల్డ్ మెడల్ సాధించిన తర్వాత సింగిల్స్‌లో మరో బంగారు పతకం కోసం భారత్‌కు నిరీక్షణ తప్పడం లేదు.






