అక్ష‌ర్ ప‌టేల్ స‌రికొత్త చ‌రిత్ర‌...ఆస్ట్రేలియా గ‌డ్డ‌పై కోహ్లీ రికార్డులు బ్రేక్‌

by velandi.Saikiran |   (  Updated:2025-11-06 16:55:49  IST  )

విరాట్ కోహ్లీ రికార్డు బ‌ద్ద‌లు కొట్టాడు అక్ష‌ర్‌. ఆస్ట్రేలియాపై ఇప్ప‌టి వ‌ర‌కు 3 సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్

అక్ష‌ర్ ప‌టేల్ స‌రికొత్త చ‌రిత్ర‌...ఆస్ట్రేలియా గ‌డ్డ‌పై కోహ్లీ రికార్డులు బ్రేక్‌
X

దిశ‌, వెబ్ డెస్క్‌: టీమిండియా వ‌ర్సెస్ ఆస్ట్రేలియా ఇవాళ జ‌రిగిన ఇవాళ్టి మ్యాచ్ లో సూర్య కుమార్ యాద‌వ్ సేన విజ‌యం సాధించింది. ఏకంగా 48 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించిన టీమిండియా.. ఈ టీ20 సిరీస్ లో 2-1 తేడాతో లీడ్ సాధించింది. ఈ మ్యాచ్ లో మొద‌ట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 167 ప‌రుగులు సాధించింది. ఇక ఈ ల‌క్ష్యాన్ని ఛేదించే క్ర‌మంలో 18.2 ఓవ‌ర్ల‌లో 119 ప‌రుగులకు ఆలౌట్ అయింది ఆసీస్‌. దీంతో టీమిండియా చేతిలో ఓడింది ఆస్ట్రేలియా.

కాగా, ఈ మ్యాచ్ లో 11 బంతుల్లో 21 ప‌రుగులు చేసి టీమిండియాను కాపాడారు అక్ష‌ర్ ప‌టేల్. అటు బౌలింగ్ లో 2 వికెట్లు ప‌డ‌గొట్టారు. దీంతో ఈ మ్యాచ్ లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ద‌క్కించుకున్నారు అక్ష‌ర్ ప‌టేల్‌. ఈ త‌రుణంలోనే టీ20 క్రికెట్ చ‌రిత్ర‌లో విరాట్ కోహ్లీ రికార్డు బ‌ద్ద‌లు కొట్టాడు అక్ష‌ర్‌. ఆస్ట్రేలియాపై ఇప్ప‌టి వ‌ర‌కు 3 సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ ద‌క్కించుకున్నారు కోహ్లీ. తాజాగా ఆ రికార్డును స‌మం చేశాడు అక్ష‌ర్ ప‌టేల్‌. కోహ్లీ టీ20ల‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన త‌రుణంలో మ‌రోసారి అవార్డ్ ద‌క్కించుకుంటే, మొద‌టి స్థానంలో అక్ష‌ర్ ప‌టేల్ నిలుస్తారు.

Next Story