- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, స్పోర్ట్స్ : పాకిస్తాన్‌తో సూపర్-4 మ్యాచ్‌లో భారత ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ బరిలోకి దిగడం అనుమానంగా మారింది. శుక్రవారం ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను తలకు గాయమైంది. ఒమన్ ఇన్నింగ్స్‌లో 15వ ఓవరలో ఈ ఘటన చోటుచేసుకుంది. శివమ్ దూబె వేసిన 15వ ఓవర్‌లో మీర్జా బంతిని గాల్లోకి లేపగా పరుగెత్తుకుంటూ వచ్చిన అక్షర్ క్యాచ్‌ను అందుకోవడంలో విఫలమయ్యాడు. ఈ క్రమంలోనే అక్షర్ కిందపడగా తల మైదానినికి బలంగా తాకింది. దీంతో మైదానాన్ని వీడిన అక్షర్ మళ్లీ ఫీల్డ్‌లోకి రాలేదు. రింకు సింగ్ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చాడు. దీంతో అతను పాక్‌తో మ్యాచ్ ఆడతాడా?లేదా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. అయితే, ఫీల్డింగ్ దిలీప్ అక్షర్ గురించ అప్‌డేట్ ఇచ్చాడు. అతను బాగానే ఉన్నాడని చెప్పాడు. అయితే, పాక్‌తో ఆడటంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఒకవేళ అక్షర్ దూరమైతే మాత్రం భారత్‌కు భారీ ఎదురుదెబ్బే. తొలి రెండు మ్యాచ్‌ల్లో చెరో వికెట్ తీసిన అతను.. ఒమన్‌పై 13 బంతుల్లో 26 రన్స్‌తో ఆకట్టుకున్నాడు. అక్షర్ ఫిట్‌గా లేకపోతే అతని స్థానంలో రింకు సింగ్‌ను తుది జట్టులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. మూడో స్పిన్నర్‌గా అభిషేక్‌ను వాడుకునేందుకు వీలు ఉంది. కాబట్టి, లోతైన బ్యాటింగ్ కోసం రింకు వైపు మొగ్గు చూపొచ్చు.






