నిరాశ పర్చిన భారత్.. ఆస్ట్రేలియా ఘన విజయం

by Gantepaka Srikanth |   (  Updated:2025-10-19 11:30:50  IST  )

పెర్త్ మైదానం(Perth Stadium) వేదికగా ఇండియాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో ఆస్ట్రేలియా(Australia) ఘన విజయం సాధించింది.

నిరాశ పర్చిన భారత్.. ఆస్ట్రేలియా ఘన విజయం
X

దిశ, వెబ్‌డెస్క్: పెర్త్ మైదానం(Perth Stadium) వేదికగా ఇండియాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో ఆస్ట్రేలియా(Australia) ఘన విజయం సాధించింది. భారత్‌(India)పై ఆసీస్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్.. నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. 21.1 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి ఆస్ట్రేలియా ఛేదించింది. కెప్టెన్ మిచెల్ మార్ష్ (46), జోష్‌ ఫిలిప్ (37) రాణించారు. భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ తలో వికెట్ తీశారు.

తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా బ్యాటర్లలో కేఎల్ రాహుల్ (38) టాప్ స్కోరర్‌గా నిలించారు. ఆ తర్వాత అక్షర్ పటేల్ (31) ఫర్వాలేదనిపించాడు. విరాట్ కోహ్లీ డకౌట్‌ కాగా.. రోహిత్‌ శర్మ (8), శుభ్‌మన్ గిల్ (10), శ్రేయస్ అయ్యర్ (11), వాషింగ్టన్ సుందర్ (10), నితీశ్ రెడ్డి (19) పరుగులు చేశారు. ఆస్ట్రేలియా బౌలర్లలో హేజిల్‌వుడ్, మిచెల్ ఓవెన్, కునెమన్ రెండేసి వికెట్లు పడగొట్టగా.. మిచెల్ స్టార్క్, నాథన్ ఎలిస్‌కు చెరో వికెట్ దక్కింది. మ్యాచ్‌కు వరుణుడు ఆటంకం కలిగించడంతో ఆటను 26 ఓవర్లకు కుదించిన విషయం తెలిసిందే.

Next Story