ఆసీస్ స్పిన్నర్ బౌలింగ్ యాక్షన్‌పై ఫిర్యాదు

by Ajay Maddhiboyina |

కూనేమాన్ ఇటీవలే ముగిసిన ఆసీస్-శ్రీలంక టెస్టు సిరీస్‌లో అద్భుతంగా రాణించాడు. రెండు మ్యాచ్‌లు కలిపి ఏకంగా 16 వికెట్లు తీసి ఆసీస్ జట్టు 2-0 తేడాతో టెస్టు సిరీస్ కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించాడు.

ఆసీస్ స్పిన్నర్ బౌలింగ్ యాక్షన్‌పై ఫిర్యాదు
X

- మాథ్యూ కూనేమాన్‌ యాక్షన్ సరిగా లేదని ఆరోపణ

- ఇటీవల శ్రీలంక సిరీస్‌లో 16 వికెట్లు తీసిన కూనేమాన్

దిశ, స్పోర్ట్స్: ఆస్ట్రేలియా స్పిన్నర్ మాథ్యూ కూనేమాన్ బౌలింగ్ యాక్షన్‌పై ఐసీసీకి ఫిర్యాదు అందింది. బంతిని విసిరే సమయంలో అతని యాక్షన్ నిబంధనలకు విరుద్దంగా లేదని, అతని యాక్షన్ అనుమానాస్పదంగా ఉందని ఫిర్యాదు చేశారు. ఇటీవల శ్రీలంకతో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో కూనేమాన్ బౌలింగ్ పరిశీలించిన తర్వాత అతని చేయి అనుమతించిన కోణం కంటే ఎక్కువగా వొంగుతుందని ఫిర్యాదు చేశారు. దీంతో మాథ్యూ కూనేమాన్‌కు ఐసీసీ బౌలింగ్ టెస్ట్ నిర్వహించే అవకాశం ఉంది. ఒక వేళ కూనేమాన్‌పై వచ్చిన ఆరోపణ నిజమైతే.. బౌలింగ్ యాక్షన్ నిబంధనలకు ప్రకారం మార్చుకునే వరకు నిషేధం విధించనున్నారు. అయితే ప్రస్తుతానికి కూనేమాన్‌ను అంతర్జాతీయ క్రికెట్‌లో బౌలింగ్ చేయకుండా సస్పెన్షన్ విధించారు. కానీ తన దేశవాళీ జట్టు టాస్మానియా తరపున బౌలింగ్ చేయడానికి ఐసీసీ అనుమతి ఇచ్చింది. కూనేమాన్ ఇటీవలే ముగిసిన ఆసీస్-శ్రీలంక టెస్టు సిరీస్‌లో అద్భుతంగా రాణించాడు. రెండు మ్యాచ్‌లు కలిపి ఏకంగా 16 వికెట్లు తీసి ఆసీస్ జట్టు 2-0 తేడాతో టెస్టు సిరీస్ కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. 2023లో ఇండోర్‌లో ఇండియాతో జరిగిన టెస్టులో కూడా ఆరు వికెట్లు తీశాడు. ఇందులో ఒక ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల ప్రదర్శన కూడా ఉంది.

Next Story