Australian Open : ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్‌గా మళ్లీ సిన్నరే

by Harish |

ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మెన్స్ సింగిల్స్ టైటిల్‌ను మరోసారి జెన్నిక్ సిన్నర్‌ కైవసం చేసుకున్నాడు.

Australian Open : ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్‌గా మళ్లీ సిన్నరే
X

దిశ, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మెన్స్ సింగిల్స్ టైటిల్‌ను మరోసారి జెన్నిక్ సిన్నర్‌ కైవసం చేసుకున్నాడు. వరుసగా రెండోసారి చాంపియన్‌గా నిలిచాడు. ఆదివారం జరిగిన ఫైనల్‌లో ఈ వరల్డ్ నం.1 ఆటగాడు 6-3, 7-6(7-4), 6-3 తేడాతో జర్మనీ ప్లేయర్ అలెగ్జాండర్ జ్వెరెవ్‌ను చిత్తు చేశాడు. 2 గంటల 42 నిమిషాలపాటు టైటిల్ పోరు ఆసక్తికరంగా సాగింది. టోర్నీలో జైత్రయాత్ర కొనసాగించిన సిన్నర్ ఫైనల్‌లోనూ అదే జోరు కొనసాగించాడు. రెండో సెట్‌లో మినహా అతనికి.. జ్వెరెవ్ నుంచి పెద్దగా పోటీ ఎదురుకాలేదు. మూడు సెట్లలోనే మ్యాచ్‌ను సొంతం చేసుకుని టైటిల్ ఎగరేసుకపోయాడు. సిన్నర్‌కు ఇది 3వ గ్రాండ్‌స్లామ్ టైటిల్. గతేడాది ఆస్ట్రేలియన్ ఓపెన్, యూఎస్ ఓపెన్ విజేతగా నిలిచాడు. మరోవైపు, తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ కల జ్వెరెవ్‌కు మరోసారి అందని ద్రాక్షనే మిగిలింది. 2020లో యూఎస్ ఓపెన్‌లో, గతేడాది ఫ్రెంచ్ ఓపెన్‌లో కూడా ఫైనల్‌లో బోల్తా పడ్డాడు.


Next Story