- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Australian Open : అల్కరాజ్‌కు ఔట్.. సెమీస్‌కు దూసుకెళ్లిన జకోవిచ్
ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సెర్బియా టెన్నిస్ దిగ్గజం నోవాక్ జకోవిచ్ సెమీస్‌కు దూసుకెళ్లాడు.

దిశ, స్పోర్ట్స్ : 25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ దిశగా సెర్బియా టెన్నిస్ దిగ్గజం నోవాక్ జకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో కీలక అడుగు వేశాడు. మెన్స్ సింగిల్స్‌లో సెమీస్‌కు దూసుకెళ్లాడు. క్వార్టర్స్‌లో బలమైన అల్కరాజ్(స్పెయిన్)ను మట్టికరిపించాడు. మంగళవారం ఆసక్తికరంగా సాగిన పోరులో జకో 4-6, 6-4, 6-3, 6-4 తేడాతో విజయం సాధించాడు. దీంతో అల్కారాజ్ మరోసారి క్వార్టర్స్‌లోనే ఇంటిదారిపట్టాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో జకోకు ఇది 99వ విజయం కావడం విశేషం. 3 గంటల 37 నిమిషాలపాటు జకో, అల్కరాజ్ మధ్య రసవత్తర పోరు సాగింది. మొదట శుభారంభం చేసింది అల్కరాజే. తొల సెట్‌ను దక్కించుకున్నాడు. ఆ తర్వాత జకో బలంగా పుంజుకున్నాడు. అల్కరాజ్ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైనప్పటికీ తన అనుభవాన్ని ప్రదర్శించాడు. వరుసగా మూడు సెట్లు నెగ్గి మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నీలో జకో సెమీస్‌లో అడుగుపెట్టడం ఇది 12వ సారి. అన్ని గ్రాండ్‌స్లాముల్లో ఇది 50వ సెమీస్. జర్మనీ ప్లేయర్ అలెగ్జాండర్ జ్వెరెవ్ కూడా సెమీస్‌కు చేరుకున్నాడు. క్వార్టర్స్‌లో అమెరికా ఆటగాడు టామీ పాల్‌ను దాటడానికి అతను తీవ్రంగా చెమటోడ్చాడు. హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో జ్వెరెవ్ 7-6(7-1), 7-0(7-0), 2-6, 6-1 తేడాతో పాల్‌ను చిత్తు చేశాడు. జ్వెరెవ్ తొలి రెండు సెట్లను టై బ్రేకర్‌లోనే నెగ్గాడంటే పాల్ నుంచి పోటీని అర్థం చేసుకోవచ్చు. సెమీస్‌లో జకో, జ్వెరెవ్ తలపడనున్నారు.
సబలెంక జోరు.. గాఫ్ ఔట్
ఉమెన్స్ సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ సబలెంకకు ఎదురులేకుండా పోయింది. టైటిల్ నిలబెట్టుకునే దిశగా సాగుతున్న ఆమె సెమీస్‌కు చేరుకుంది. క్వార్టర్ ఫైనల్‌లో సబలెంక 6-2, 2-6, 6-3 తేడాతో 27వ సీడ్ పావ్లియుచెంకోవాను ఓడించింది. అమెరికా యువ సంచలనం కోకా గాఫ్ క్వార్టర్స్‌లోనే నిష్ర్కమించింది. ఆమెకు స్పెయిన్ క్రీడాకారిణి బడోసా షాకిచ్చింది. ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌లో బడోసా 7-5, 6-4 తేడాతో గాఫ్‌ను చిత్తు చేసింది. గాఫ్ ఆరు డబుల్ ఫౌల్ట్స్ 41 అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది.






