- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Australian Open : తొలి రౌండ్‌లోనే సుమిత్ ఔట్.. సబలెంక శుభారంభం
ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఉమెన్స్ సింగిల్స్ వరల్డ్ నం.1, డిఫెండింగ్ చాంపియన్ సబలెంక టైటిల్ నిలబెట్టుకునే దిశగా తొలి అడుగు వేసింది.

దిశ, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఉమెన్స్ సింగిల్స్ వరల్డ్ నం.1, డిఫెండింగ్ చాంపియన్ సబలెంక టైటిల్ నిలబెట్టుకునే దిశగా తొలి అడుగు వేసింది. టోర్నీలో శుభారంభం చేసింది. ఆదివారం జరిగిన తొలి రౌండ్‌లో సబలెంక 6-3, 6-2 తేడాతో అమెరికా క్రీడాకారిణి స్లోన్ స్టీఫెన్స్‌పై విజయం సాధించింది. గంటా 11నిమిషాలపాటు సాగిన మ్యాచ్‌లో సబలెంక స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించింది. ప్రత్యర్థి పోలిస్తే ఎక్కువే పొరపాట్లు చేసినప్పటికీ ఐదుసార్లు అమెరికా క్రీడాకారిణి సర్వీస్‌లను బ్రేక్ చేయడంతో రెండు సెట్లలోనే మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. పారిస్ ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ క్వినెన్ జెంగ్(చైనా) కూడా రెండో రౌండ్‌కు చేరుకుంది. తొలి రౌండ్‌లో క్వినెన్ 7-6(7-3), 6-1 తేడాతో అంకా టోడోని(రొమానియా)ను ఓడించింది. మరోవైపు, మెన్స్ సింగిల్స్‌లో భారత స్టార్ ఆటగాడు సుమిత్ నగాల్‌కు నిరాశ తప్పలేదు. తొలి రౌండ్‌లో 26వ సీడ్ థామస్ మచాక్(చెక్ రిపబ్లిక్) చేతిలో 6-3, 6-1, 7-5 తేడాతో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్ర్కమించాడు. 2వ సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్(ఇటలీ), 6వ సీడ్ కాస్పర్ రూడ్(నార్వే) శుభారంభం చేశారు. తొలి రౌండ్‌లో లూకాస్ పౌల్లే(ఫ్రాన్స్)పై 6-4, 6-4, 6-4 తేడాతో జ్వెరెవ్ నెగ్గాడు. స్పెయిన్ ప్లేయర్ జామ్ మునార్‌పై 6-3,1-6, 7-5, 2-6, 6-1 తేడాతో రూడ్ పోరాడి గెలిచాడు.






