- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Australian Open - 2025 : నాలుగో రౌండ్‌కు అల్కరాజ్, జకోవిచ్
కార్లోస్ అల్కరాజ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ నాలుగో రౌండ్‌కు చేరుకున్నాడు.

దిశ, స్పోర్ట్స్ : కార్లోస్ అల్కరాజ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ నాలుగో రౌండ్‌కు చేరుకున్నాడు. శుక్రవారం జరిగిన మూడో రౌండ్‌లో అతను నునో బొర్జెస్‌పై 6-2, 6-4, 6-7, 6-4 తేడాతో గెలిచాడు. అల్కరాజ్ తొలి రెండు సెట్లలో జోరు కొనసాగించాడు. మూడో సెట్‌ను బొర్జెస్ సొంతం చేసుకున్నాడు. తొలి సెట్‌లో బొర్జెస్ 2-0 లీడ్‌లోకి రాగా తర్వాత ఒక్కసారిగా అల్కరాజ్ పుంజుకున్నాడు. 31 నిమిషాలు సాగిన తొలిసెట్‌ను 6-2 తేడాతో గెలుచుకున్నాడు. రెండో సెట్‌ను 6-4 తేడాతో గెలుచుకున్న అల్కరాజ్ మూడో సెట్‌లో 6-7తో కోల్పోయాడు. దీంతో నిర్ణయాత్మక నాలుగో సెట్‌లో అల్కరాజ్ 6-4 తేడాతో బొర్జెస్‌ను ఓడించి మ్యాచ్ గెలుచుకున్నాడు. మరోవైపు అలెగ్జాండర్ జ్వెరెవ్ సైతం నాలుగో రౌండ్‌కు చేరుకున్నాడు. మూడో రౌండ్‌లో తన ప్రత్యర్థి జాకొబ్ ఫియర్‌న్లీపై 6-3, 6-4, 6-4 తేడాతో వరుస సెట్లు గెలిచి జ్వెరెవ్ మ్యాచ్ సొంతం చేసుకున్నాడు.
జకోవిచ్ దూకుడు..
ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో జకోవిచ్ దూకుడు కొనసాగుతోంది. శుక్రవారం జరిగిన మూడో రౌండ్‌లో థామస్ మచాక్‌ను జకోవిచ్ 6-1, 6-4, 6-4 తేడాతో వరుస సెట్లలో ఓడించాడు. రెండు గంటల 22 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో తొలి రౌండ్ నుంచి జకోవిచ్ ఆధిపత్యం చెలాయించాడు. ఈ విజయంతో జకోవిచ్ వరుసగా 17వ సారి ఆస్ట్రేలియన్ ఓపెన్ నాలుగో రౌండ్‌కు చేరినట్లయింది. నాలుగో రౌండ్‌లో జకోవిచ్ చెక్ రిపబ్లిక్ ఆటగాడు జిరి లెహచ్కాతో తలపడనున్నాడు.
అదరగొట్టిన కొకొగాఫ్
మహిళల సింగిల్స్‌లో కొకొ గాఫ్ సైతం నాలుగో రౌండ్‌లో అడుగుపెట్టింది. 2021 యూఎస్ ఓపెన్ విజేత లెల్హా ఫెర్నాండెజ్‌ను గాఫ్ మూడో రౌండ్‌లో ఓడించింది. ఒక్క గంట 16 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో ఫెర్నాండెజ్‌ను 6-4, 6-2 తేడాతో గాఫ్ ఓడించింది. నాలుగో రౌండ్‌లో గాఫ్ స్విట్జర్లాండ్‌కు చెందిన బెలిండా బెన్సిక్‌తో తలపడనుంది. బెలిండా మూడో రౌండ్‌లో నవొమి ఓసాకాతో తలపడింది. అయితే ఈ మ్యాచ్‌లో తొలి సెట్‌ను 6-7తో ఓడిపోయిన తర్వాత ఒసాకా గాయం కారణంగా మ్యాచ్ మధ్యలోనే నిష్క్రమించింది. దీంతో బెలిండా బెన్సిక్ నాలుగో రౌండ్‌లో కొకొ గాఫ్‌తో బరిలో దిగనుంది.






