- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ షాకింగ్ నిర్ణయం.. ఇంటర్నేషనల్ క్రికెట్‌కు వీడ్కోలు
ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలో తనదైన ముద్ర వేసిన సీనియర్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా (Usman Khawaja) సంచలన నిర్ణయం తీసుకున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలో తనదైన ముద్ర వేసిన సీనియర్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా (Usman Khawaja) సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రేపు సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ (SCG) వేదికగా ఇంగ్లాండ్ (England)తో జరగబోయే ఐదో యాషెస్ టెస్ట్ మ్యాచ్ తన కెరీర్‌లో చివరిదని అధికారికంగా ప్రకటించారు. శుక్రవారం ఉదయం తన భార్య, పిల్లలతో కలిసి మీడియా ముందుకు వచ్చిన 39 ఏళ్ల ఖవాజా, భావోద్వేగపూరితమైన ప్రసంగంతో తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెల్లడించారు.
అయితే, ఉస్మాన్ ఖవాజా తన టెస్ట్ కెరీర్‌ను 2011లో సిడ్నీ (SCG) వేదికగానే ఇంగ్లాండ్‌పై ప్రారంభించారు. సరిగ్గా 15 ఏళ్ల తర్వాత అదే మైదానంలో, మళ్లీ అదే జట్టుతో ఆడి ఆటకు స్వస్తి పలకడం ఒక అరుదైన మైలురాయిగా నిలిచిపోనుంది. పాకిస్థాన్‌లో జన్మించి, ఆస్ట్రేలియా జాతీయ జట్టుకు ఆడిన మొదటి ముస్లిం క్రికెటర్‌గా ఖవాజా చరిత్ర సృష్టించారు. ఇప్పటి వరకు 87 టెస్టులు ఆడిన ఆయన 43.39 సగటుతో 6,206 పరుగులు చేశారు. ఇందులో 16 సెంచరీలు, 28 అర్ధసెంచరీలు ఉన్నాయి. అన్ని ఫార్మాట్లు కలిపి అంతర్జాతీయ స్థాయిలో 8,000 కంటే ఎక్కువ పరుగులు సాధించారు. 2023లో ఐసీసీ ‘మెన్స్ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును అందుకోవడం ఉస్మాన్ ఖవాజా కెరీర్‌లో అత్యున్నత ఘట్టం.






