- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
7 వికెట్లతో చెలరేగిన ఆసిస్ స్పిన్నర్.. సౌతాఫ్రికాను చిత్తు చేసిన ఆస్ట్రేలియా.. సెమీస్‌లో భారత్‌తో ఢీ
మహిళల వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా స్పిన్నర్ అలానా కింగ్ అద్భుత ప్రదర్శన చేసింది.

దిశ, స్పోర్ట్స్ : మహిళల వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా స్పిన్నర్ అలానా కింగ్ అద్భుత ప్రదర్శన చేసింది. సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్లు పడగొట్టి ఔరా అనిపించింది. ఆమె స్పిన్ ధాటికి సఫారీల జట్టు చిత్తుగా ఓడింది. ఇండోర్‌లో శనివారం జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా తేలిపోయింది. అలానా కింగ్ స్పిన్ ఉచ్చులో ఇరుక్కున్న ఆ జట్టు బయటపడలేకపోయింది. వొల్వార్ట్(31) టాప్ స్కోరర్. బ్రెట్స్(6), సునె లూస్(6), మారిజన్నె కాప్(0), ట్రైయోన్(0) వంటి కీలక బ్యాటర్లు విఫలమయ్యారు. దీంతో సౌతాఫ్రికా 24 ఓవర్లలోనే 97 పరుగులకే కుప్పకూలింది. 98 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆసిస్ 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. బెత్ మూనీ(42), జార్జియా వాల్(38 నాటౌట్) రాణించారు. ప్రపంచకప్‌లో ఎదురులేకుండా దూసుకెళ్తున్న ఆస్ట్రేలియాకు ఇది వరుసగా 6వ విజయం. సౌతాఫ్రికాపై గెలుపుతో ఆ జట్టు గ్రూపు దశను అజేయంగా ముగించింది. ఈ విజయంతో సెమీస్‌లో భారత్‌తో తలపడే ప్రత్యర్థి ఎవరో కూడా తేలిపోయింది. ఈ నెల 30న జరిగే సెమీస్‌లో భారత్, ఆస్ట్రేలియా తలపడనున్నాయి.






