- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టిమ్ డేవిడ్ సంచలన ఇన్నింగ్స్.. సౌతాఫ్రికాను ఓడించిన ఆస్ట్రేలియా
సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌లో ఆస్ట్రేలియా శుభారంభం చేసింది.

దిశ, స్పోర్ట్స్ : సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌లో ఆస్ట్రేలియా శుభారంభం చేసింది. డార్విన్ వేదికగా ఆదివారం జరిగిన తొలి టీ20లో 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. టిమ్ డేవిడ్(83) మెరుపులకుతోడు బౌలర్లు కూడా సమిష్టిగా రాణించడంతో ఆసిస్ విజయం తేలికైంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు ఆసిస్ నిర్ణీత 20 ఓవర్లలో 178 పరుగులు చేసి ఆలౌటైంది. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో టిమ్ డేవిడ్ అద్భుతమైన పోరాట కనబరిచాడు. మిగతా వాళ్లు తేలిపోగా అతను జట్టును ఆదుకున్నాడు. 52 బంతుల్లో 4 ఫోర్లు,8 సిక్సర్లతో 83 పరుగులు చేశాడు. అతని తర్వాత గ్రీన్(35) మాత్రమే పర్వాలేదనిపించాడు. డేవిడ్ పోరాటంతోనే ఆసిస్ 178 పరుగులు చేసింది. సౌతాఫ్రికా బౌలర్లలో క్వెనా మఫాకా 4 వికెట్లతో సత్తాచాటాడు. అనంతరం ఛేదనకు దిగిన సౌతాఫ్రికా 179 పరుగుల లక్ష్య ఛేదనలో పోరాడినా ఫలితం దక్కలేదు. ఆసిస్ బౌలర్లు హేజల్‌వుడ్, బెన్ ద్వార్షుయిస్ చెరో 3 వికెట్లు పడగొట్ట సఫారీలను నిలువరించారు. దీంతో ర్యాన్ రికెల్టన్(71) చేసిన ఒంటరి పోరాటం వృథా అయ్యింది. స్టబ్స్(37) పర్వాలేదనిపించగా మిగతా వాళ్ల నుంచి సహకారం దక్కలేదు. దీంతో సౌతాఫ్రికా 20 ఓవర్లలో 9 వికెట్లను కోల్పోయి 161 పరుగులే చేసి ఓటమిపాలైంది. మూడు టీ20ల సిరీస్‌లో ఆసిస్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. మంగళవారం రెండో టీ20 జరగనుంది.






