- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Australia vs India : టీ20 సిరీస్ భారత్ కైవసమయ్యేనా?.. నేడే ఆఖరి టీ20
టీ20 సిరీస్‌లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య శనివారం ఐదో టీ20 జరగనుంది.

దిశ, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియా టూరులో వన్డే సిరీస్ కోల్పోయిన భారత జట్టుకు ఆసిస్‌పై ప్రతీకారం తీర్చుకోవడానికి చక్కటి అవకాశం లభించింది. టీ20 సిరీస్ విజయంపై కన్నేసింది సూర్య సేన. వరుసగా మూడు, నాలుగు టీ20ల్లో విజయాలు నమోదు చేసిన భారత జట్టు 2-1తో ఆధిక్యంలో ఉంది. నేడు బ్రిస్బేన్ వేదికగా ఆఖరిదైన 5వ టీ20 జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి టీ20 సిరీస్ టీమిండియా కైవసం అవుతుంది. ఓడితే సిరీస్ 2-2తో సిరీస్ సమమవుతుంది. టీ20ల్లో ఆస్ట్రేలియా మంచి రికార్డు కలిగిన భారత జట్టు ఆఖరి మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్ దక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతున్నది. మరోవైపు, సొంతగడ్డపై సిరీస్ కాపాడుకోవాలని ఆస్ట్రేలియా చూస్తోంది.
బ్యాటింగ్ మెరగవ్వాలె
భారత్ గత రెండు మ్యాచ్‌ల్లో బ్యాటింగ్ పరంగా అంచనాలను అందుకోలేకపోయింది. మూడో టీ20లో సుందర్ రాణించి జట్టును గెలిపించగా.. నాలుగో టీ20లో గెలుపు క్రెడిట్ బౌలర్లకే దక్కుతుంది. అభిషేక్, గిల్, సూర్య, తిలక్ తమ స్థాయి ప్రదర్శన చేయలేకపోతున్నారు. దూకుడుగా ఆడే క్రమంలో త్వరగానే అవుటవుతున్నారు. ఆఖరి మ్యాచ్‌లో వీళ్లు కీలక ఇన్నింగ్స్‌లు ఆడాల్సిన అవసరం ఉంది. ఆల్‌రౌండర్లు అక్షర్ పటేల్, సుందర్ రాణిస్తూ జట్టు విజయాల్లో భాగమవుతున్నారు. బౌలింగ్‌పరంగా భారత్‌కు ఢోకా లేదు. నాలుగో టీ20లో 167 పరుగుల తక్కువ స్కోరే చేసినప్పటికీ ఆసిస్‌ను నిలువరించిన తీరు భారత బౌలింగ్ దళం బలాన్ని తెలియజేస్తోంది. ఆఖరి టీ20లోనూ భారత బౌలర్లు అదే జోరును కొనసాగిస్తూ కంగారులకు కళ్లెం వేయాలి.
ఆసిస్ గడ్డపై భారత్ ఆధిపత్యం
ఏ జట్టైనా తమ సొంతగడ్డపై ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. కానీ, టీ20ల్లో ఆసిస్ గడ్డపై భారత్‌కు తిరుగులేని రికార్డు ఉంది. సొంతగడ్డపై ఆస్ట్రేలియా టీ20 సిరీస్ గెలవకపోవడం గమనార్హం. ఇప్పటివరకు భారత్‌కు నాలుగు సార్లు(ఒక్కటి కంటే ఎక్కువ మ్యాచ్‌లు) ఆస్ట్రేలియా ఆతిథ్యమిచ్చింది. ఒక్కసారి కూడా భారత్ సిరీస్ కోల్పోలేదు. భారత్ రెండు సిరీస్‌లు గెలిచింది. మరో రెండు సిరీస్‌లు సమంగా ముగిశాయి. చివరిసారిగా ఆస్ట్రేలియాలో జరిగిన సిరీస్‌ను భారత్ 3-1తో కైవసం చేసుకుంది. ఈ సారి కూడా తమ ఆధిపత్యాన్ని కొనసాగించాలని టీమిండియా భావిస్తుంది.
గబ్బానే నమ్ముకున్న ఆసిస్
బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియం ఆస్ట్రేలియాకు కంచుకోట. టీ20ల్లో గబ్బాలో ఆసిస్ 2006 నుంచి ఒక్కసారి మాత్రమే ఓడింది. 8 మ్యాచ్‌ల్లో ఏడింట గెలిచింది. 2013లో వెస్టిండీస్ చేతిలో ఓడిపోయింది. భారత్‌తో ఆఖరి మ్యాచ్ గబ్బా స్టేడియంలోనే జరుగుతుండటం ఆసిస్‌కు ఆత్మవిశ్వాసాన్ని పెంచేదే. 2018లో ఇరు జట్లు గబ్బాలో తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 4 పరుగుల తేడాతో గెలిచింది. ఆ ఆత్మవిశ్వాసంతో ఆఖరి మ్యాచ్‌లో గెలిచి సిరీస్ సమయం చేయాలని ఆతిథ్య జట్టు చూస్తున్నది. అయితే, ఆసిస్ బ్యాటర్లు నిలకడలేమితో ఇబ్బందిపడుతున్నారు. మార్ష్, టిమ్ డేవిడ్, మాథ్యూ షార్ట్ జట్టుకు బలంగా కనిపిస్తున్నారు. బౌలింగ్‌లో నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా కీలకం కానున్నారు.






