- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టీ20 వరల్డ్ కప్ ఆడే ఆస్ట్రేలియా జట్టు ఇదే..భయంకరమైన ప్లేయర్లతో ఎంట్రీ
టీ20 ప్రపంచ కప్ ఆడే జట్టును ప్రకటించింది ఆస్ట్రేలియా. ఈ జట్టుకు ఎప్పటిలాగే మిచెల్ మార్ష్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు.

దిశ, వెబ్ డెస్క్: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ఫిబ్రవరి 5వ తేదీ నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. మార్చి 8వ తేదీ వరకు ఈ మెగా టోర్నమెంట్ నిర్వహించనున్నారు. ఇండియా, శ్రీలంక రెండు దేశాలకు కూడా ఈ టోర్నమెంట్ కు ఆతిథ్యం ఇస్తున్నాయి. మొత్తం ఈ టోర్నమెంట్ లో 20 జట్లు పాల్గొంటున్నాయి. ఈ టోర్నమెంటుకు కేవలం నెలరోజుల సమయం ఉన్న నేపథ్యంలో వరుసగా తమ జట్లను ప్రకటిస్తున్నాయి క్రికెట్ బోర్డులు. ఇందులో భాగంగానే తాజాగా టీ20 ప్రపంచ కప్ ఆడే జట్టును ప్రకటించింది ఆస్ట్రేలియా. ఈ జట్టుకు ఎప్పటిలాగే మిచెల్ మార్ష్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు.
టి20 ప్రపంచ కప్ ఆడే ఆస్ట్రేలియా జట్టు ఇదే
మిచెల్ మార్ష్ (C ), జేవియర్ బార్ట్‌లెట్, కూపర్ కొన్నోలీ, పాట్ కమ్మిన్స్, టిమ్ డేవిడ్, కామెరాన్ గ్రీన్, నాథన్ ఎల్లిస్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ కుహ్నెమాన్, గ్లెన్ మాక్స్‌వెల్, మాథ్యూ షార్ట్, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపా






