ముగిసిన భారత బ్యాటింగ్.. హర్షిత్ రానా మెరుపులతో పోరాడే స్కోర్

by Malleboina Mahesh |

భారత్ vs ఆస్ట్రేలియా జట్ల మధ్య అడిలైడ్ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో ఆస్ట్రేలియా బౌలర్లు మరోసారి విజృంభించారు.

ముగిసిన భారత బ్యాటింగ్.. హర్షిత్ రానా మెరుపులతో పోరాడే స్కోర్
X

దిశ, వెబ్ డెస్క్: భారత్ vs ఆస్ట్రేలియా జట్ల మధ్య అడిలైడ్ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో ఆస్ట్రేలియా బౌలర్లు మరోసారి విజృంభించారు. ఈ మ్యాచులో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకోవడంతో భారత్ మొదట బ్యాటింగ్ చేసింది. దీంతో క్రీజులోకి వచ్చిన గిల్, విరాట్ కోహ్లీ వెంట వెంటనే అవుట్ కావడంతో పీకల్లోతు కష్టాల్లో పడ్డ భారత జట్టును రోహిత్ శర్మ 73, శ్రేయస్ అయ్యర్ 61 పరుగులతో ఆదుకున్నారు. అలాగే ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ 44, పరుగులు చేసి భారత స్కోరులో భాగస్వామ్యం అయ్యాడు. చివర్లో హర్షిత్ రాణా 24, పరుగులతో మెరవడం తో భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 264 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్ 2, బర్ట్లెట్ 3, ఆడమ్ జంపా 4 వికెట్లు తీసుకున్నారు. ఈ మ్యాచులో ఆస్ట్రేలియా జట్టు గెలవాలంటే నిర్ణీత 50 ఓవర్లలో 265 పరుగులు చేయాల్సి ఉంది. మరీ ఈ స్వల్ప స్కోరును ఆస్ట్రేలియా జట్టు ఈజీగా చేజ్ చేస్తుందా.. లేక భారత బౌలర్లు ఈ స్కోరును కాపాడుకొని వన్డే సిరీస్ రేసులోకి వస్తారా.. తెలియాలంటే సాయంత్రం వరకు వేచి చూడాల్సిందే.

Next Story