AUS vs IND: నాలుగో టీ20లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా

by Malleboina Mahesh |

భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య 5 మ్యాచుల టీ20 సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో ఇప్పటికే మూడు మ్యాచులు పూర్తిగా ఈ రోజు నాలుగో టీ20 జరుగుతుంది.

AUS vs IND: నాలుగో టీ20లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా
X

దిశ, వెబ్ డెస్క్: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య 5 మ్యాచుల టీ20 సిరీస్ (T20 series) జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో ఇప్పటికే మూడు మ్యాచులు పూర్తిగా ఈ రోజు నాలుగో టీ20 జరుగుతుంది. క్వీన్స్ లాండ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచులో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత జట్టు మొదట బ్యాటింగ్ చేయనుంది. ఈ సిరీస్ లో ఇప్పటికే చెరో మ్యాచ్ గెలవగా.. ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. మిగిలిన రెండు మ్యాచ్ లలో గెలిచిన జట్టు టీ20 సిరీస్ ను కైవసం చేసుకొనుంది. నేటి మ్యాచ్ లో విజయం ఇరు జట్లుకు అవసరంగా మారింది. దీంతో ఈ రోజు మ్యాచ్ రసవత్తరంగా కొనసాగే అవకాశ ఉంది. మరి ఈ మ్యాచ్ లో ఏ జట్టు గెలిచి సిరీస్ రేసులో ముందుకెళ్తుందో తెలియాలంటే సాయంత్రం వరకు వేచి చూడాల్సిందే.

ఆస్ట్రేలియా ప్లేయింగ్ XI: మిచెల్ మార్ష్ (సి), మాథ్యూ షార్ట్, జోష్ ఇంగ్లిస్ (w), టీమ్ డేవిడ్, జోష్ ఫిలిప్, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మాక్స్‌వెల్, బెన్ ద్వార్షుయిస్, జేవియర్ బార్ట్‌లెట్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా

భారత్ ప్లేయింగ్ XI: అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్(సి), తిలక్ వర్మ, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, జితేష్ శర్మ(w), శివమ్ దూబే, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చకరవర్తి, జస్ప్రీత్ బుమ్రా

Next Story