మళ్లీ టాస్ ఓడిన భారత్.. ఫస్ట్ బ్యాటింగ్ ఎవరిదంటే..?

by Malleboina Mahesh |

భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య వన్డే సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ రోజు మూడో వన్డే ప్రారంభం అయింది.

మళ్లీ టాస్ ఓడిన భారత్.. ఫస్ట్ బ్యాటింగ్ ఎవరిదంటే..?
X

దిశ, వెబ్ డెస్క్: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య వన్డే సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ రోజు మూడో వన్డే ప్రారంభం అయింది. సిడ్నీ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచులో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో భారత జట్టు మొదట బౌలింగ్ చేయనుంది. మూడు వన్డేల సిరీస్ లో రెండు మ్యాచుల్లో ఓడిన భారత్ సిరీస్ ను కోల్పోయింది. దీంతో ఈ మ్యాచులో అయిన గెలిచి పరువు కాపాడుకోవాలని చూస్తుంది. మరో పక్క ఈ మ్యాచులో కూడా గెలిచి సిరీస్ ను 3-0 తో క్లీన్ స్వీప్ చేయాలని ఆస్ట్రేలియా భావిస్తుంది. ఇందులో భాగంగానే టాస్ గెలిచిన వెంటనే బ్యాటింగ్ ఎంచుకొని భారత బౌలర్లకు సవాల్ విసిరింది.

ఈ మ్యాచులో భారత జట్టు ఒక మార్పును చేసింది. ఆల్ రౌండర్ నితీష్ స్థానంలో బౌలర్ ప్రసిద్ద్ కృష్ణన్ ను తీసుకొచ్చింది. అలాగే ఆస్ట్రేలియా సైతం నాథన్ ఎల్లీస్ ను జట్టులోకి తీసుకొని బార్ట్‌లెట్ ను బయటకు పంపింది. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అవుతున్నాయి. గతంలో ఇదే సిడ్నీ వేదికగా చివరి టెస్టు ఆడిన విరాట్ కోహ్లీ టెస్ట్ కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటిచాడు. దీంతో నేడు కూడా అలాగే వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటిస్తాడేమోనని అనేక మంది అంచనా వేస్తున్నారు. దీంతో క్రికెట్ అభిమానులతో పాటు విరాట్ కోహ్లీ ఫాలోవర్స్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది. మరి సాయంత్రం ఎమ్ జరగబోతుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.

భారత్ ప్లేయింగ్ XI: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కె ఎల్ రాహుల్ (కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ

ఆస్ట్రేలియా ప్లేయింగ్ XI: మిచెల్ మార్ష్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, మాథ్యూ షార్ట్, మాట్ రెన్షా, అలెక్స్ కారీ (కెప్టెన్), కూపర్ కొన్నోలీ, మిచెల్ ఓవెన్, నాథన్ ఎల్లిస్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హాజిల్‌వుడ్

Next Story