- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వర్షం ఎఫెక్ట్.. 26 ఓవర్లకు ముగిసిన భారత బ్యాటింగ్
భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య పెర్త్ వేదికగా జరుగుతున్న మొదటి వన్డే మ్యాచ్ లో వర్షం తీవ్ర అడ్డంకిగా మారింది.

దిశ, వెబ్ డెస్క్: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య పెర్త్ వేదికగా జరుగుతున్న మొదటి వన్డే మ్యాచ్ లో వర్షం తీవ్ర అడ్డంకిగా మారింది. కేవలం 14 ఓవర్ల మ్యాచ్‌లో కనీసం 6 సార్లు వర్షం మ్యాచుకు అడ్డం తగిలింది. చివరకు వర్షం ఆగినప్పటికి.. మ్యాచును కేవలం 26 ఓవర్లకు కుదించారు. అప్పటికే 16 ఓవర్లకు పైగా ఆడిన భారత్ కు తీవ్ర నిరాశ ఎదురైంది. అయినప్పటికి క్రీజులో ఉన్న అక్షర్ పటేల్ 31, కేఎల్ రాహుల్ 38 పరుగులతో ఫోర్లు, సిక్సర్లు కొట్టిన కొద్ది సేపటికే అవుట్ అయ్యారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ప్లేయర్లు సరిగ్గా రాణించలేకపోయారు. చివర్లో ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి 2 సిక్సర్లతో కాస్త స్కోరును జోడించాడు. దీంతో వర్షం కారణంగా కుదించబడిన 26 ఓవర్లకు భారత్ 9 వికెట్లు కోల్పోయి కేవలం 136 పరుగులు మాత్రమే చేసింది. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్, నాధన్, ఒక్కో వికెట్ తీసుకోగా, ఎంజిల్ వుడ్, మిచెల్, మ్యాత్యూ రెండేసి వికెట్లు తీసుకున్నారు. ఈ మ్యాచులో ఆస్ట్రేలియా జట్టు విజయం సాధించాలంటే నిర్ణీత 26 ఓవర్లలో 137 పరుగులు చేయాల్సి ఉంది.






