- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
PCBలో మొత్తం అవినీతే.. పాకిస్థాన్ ప్లేయర్ల జెర్సీలలో చెమట కంప్ !
ఆసియా కప్ 2025 టోర్నమెంట్ జరుగుతున్న నేపథ్యంలో... పాకిస్తాన్ మాజీ క్రికెటర్ అతిక్-ఉజ్-జమాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్ డెస్క్ : ఆసియా కప్ 2025 టోర్నమెంట్ జరుగుతున్న నేపథ్యంలో... పాకిస్తాన్ మాజీ క్రికెటర్ అతిక్-ఉజ్-జమాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డులో అవినీతి పేరుకుపోయిందని బాంబు పెంచారు. దీనికి సాక్ష్యం ఆసియా కప్ 2025 టోర్నమెంటులో పాకిస్తాన్ వ్యవహరిస్తున్న తీరే ఉదాహరణ అన్నారు. పాకిస్తాన్ ప్లేయర్లు... ఈ టోర్నమెంట్ లో నాణ్యతలేని కిట్లను వాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇతర జట్ల ప్లేయర్లు.. నీట్ జెర్సీలు ధరిస్తే... పాకిస్తాన్ ప్లేయర్లు మాత్రం చెమట కంపుతో ఉన్న జెర్సీలు ధరించారని సంచలన వ్యాఖ్యలు చేశారు అతిక్-ఉజ్-జమాన్. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కు వస్తున్న డబ్బులను కొంతమంది తినడం వల్ల... ఇలాంటి పరిస్థితి నెలకొంది అన్నారు. ఒక బ్యాట్ ఇద్దరు వాడుతున్న పరిస్థితి కూడా ఉందని.. ఆయన పేర్కొన్నారు. దీంతో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ జమాన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఇది ఇలా ఉండగా ఆసియా కప్ 2025 టోర్నమెంటులో సూపర్ 4 కు దూసుకువెళ్లింది పాకిస్థాన్.






