- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, స్పోర్ట్స్ : భారత మహిళా స్టార్ అథ్లెట్, వైజాగ్‌కు చెందిన యర్రాజి జ్యోతి ఇటీవల గాయపడిన విషయం తెలిసిందే. ఈ నెల ఆరంభంలో ట్రైనింగ్ సెషన్‌లో ఆమె కుడి మోకాలికి గాయమైంది. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో జ్యోతి తాజాగా సర్జరీ చేయించుకుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా జ్యోతి తెలిపింది. ‘ఈ శుక్రవారం నా మోకాలికి సర్జరీ జరిగింది. గత కొన్ని వారాలు నాకు కష్టంగా గడిచాయి. నాకు ఇష్టమైన దాన్ని చేయకుండా గాయం అడ్డుకుంది. త్వరలోనే తిరిగి వస్తా.’అని జ్యోతి పేర్కొంది. రోడ్డు ప్రమాదంలో గాయపడిన పంత్‌కు చికిత్స అందించి అతను కోలుకోవడంలో సహాయపడిన డాక్టర్ దిన్షా పార్ధివాలానే జ్యోతికి కూడా సర్జరీ చేశారు. అయితే, సర్జరీ కారణంగా ఆమె సెప్టెంబర్‌లో జరిగే వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌కు దూరమయ్యే చాన్స్ ఉంది. ఇటీవల ఏసియన్ చాంపియన్‌షిప్స్‌లో 100 మీటర్ల హార్డిల్స్‌ో జ్యోతి గోల్డ్ మెడల్ సాధించింది.
- Tags
- Jyothi Yarraji






