- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ, స్పోర్ట్స్ : మంగోలియాలో జరుగుతున్న ఏసియన్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ బాక్సర్, తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ కాంస్య పతకంతో సరిపెట్టింది. బంగారు పతక అంచనాలతో బరిలోకి దిగిన ఆమె ఫైనల్ చేరుకోలేకపోయింది. 51 కేజీల కేటగిరీలో పోటీపడిన నిఖత్ సెమీస్‌లో పరాజయం పాలైంది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో పారిస్ ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ వు యు(చైనా) చేతిలో 5-0 తేడాతో ఓడిపోయింది. 75 కేజీల కేటగిరీలో టోక్యో ఒలింపిక్స్ బ్రాంజ్ మెడలిస్ట్ లవ్లీనా బోర్గోహైన్ కూడా కాంస్యంతోనే సరిపెట్టింది. సెమీస్‌లో ఉజ్బెకిస్తాన్ బాక్సర్ అజిజా జోకిరోవా చేతిలో 5-0 తేడాతో పరాజయం పాలైంది. అంకుషిత బోరో(65 కేజీలు), పూజ రాణి(80 కేజీలు)లు కూడా సెమీస్‌లో ఓడి బ్రాంజ్ మెడల్‌తోనే ఇంటిదారిపట్టారు.
స్వర్ణ పతక పోరుకు ముగ్గురు
ప్రీతి పవర్, ప్రియా, అరుంధతి చౌదరి మాత్రం సత్తాచాటారు. తమ విభాగాల్లో ఫైనల్‌కు చేరుకుని గోల్డ్ మెడల్‌పై కన్నేశారు. 54 కేజీల కేటగిరీలో ప్రీతి సెమీస్‌లో పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత ఏజీ ఇమ్‌ను 5-0తో మట్టికరిపించింది. 60 కేజీల కేటగిరీలో ప్రియా 5-0తోనే మంగోలియాకు చెందిన నమూన్ మోంఖోర్‌పై ఏకపక్ష విజయం సాధించింది. ఇక 70 కేజీల కేటగిరీలో అరుంధతి 4-1 తేడాతో ఉజ్బెకిస్తాన్ బాక్సర్ ఓయ్షా టోయిరోవాను చిత్తు చేసింది. టైటిల్ పోరులో ప్రీతి మూడు సార్లు వరల్డ్ చాంపియన్‌గా నిలిచిన హువాంగ్ సియావో వెన్(చైనీస్ తైపీ)ని ఎదుర్కోనుంది. నార్త్ కొరియాకు చెందిన ఉన్ గ్యోంగ్ వోన్‌తో ప్రియాతో, బకిత్ సెయిడిష్(కజకస్థాన్‌తో అరుంధతి తలపడనున్నారు.






