Jyoti Yarraji : ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌.. తెలుగమ్మాయికి గోల్డ్ మెడల్

by Muthe.Rajitha |

దక్షిణ కొరియా(South Korea)లో జరుగుతున్న ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌(Asian Athletics Championships)లో తెలుగమ్మాయి గోల్డ్ మెడల్ కొట్టింది.

Jyoti Yarraji : ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌.. తెలుగమ్మాయికి గోల్డ్ మెడల్
X

దిశ, వెబ్ డెస్క్ : దక్షిణ కొరియా(South Korea)లో జరుగుతున్న ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌(Asian Athletics Championships)లో తెలుగమ్మాయి గోల్డ్ మెడల్ కొట్టింది. భారత అథ్లెట్ జ్యోతి యర్రాజీ(Jyoti Yarraji) ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా నేడు జరిగిన మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌(100m Hurdles)లో 12.96 సెకన్లతో బంగారు పతకం(Gold Medal) గెలిచి, కొత్త రికార్డు సృష్టించింది. రేసులో మొదట కొంచెం వెనకపడ్డట్టు అనిపించినా.. చివర్లో అద్భుతంగా పుంజుకుని గెలిచింది. 2023లో బ్యాంకాక్‌లో కూడా ఆమె 13.09 సెకన్లతో బంగారం సాధించింది. 2023లో చెంగ్డులో 12.78 సెకన్లతో జాతీయ రికార్డు నెలకొల్పింది.

ఏపీ(AP)లోని విశాఖపట్నానికి చెందిన జ్యోతి తండ్రి సెక్యూరిటీ గార్డుగా, తల్లి ఆసుపత్రిలో క్లీనర్‌గా పనిచేస్తారు. హైదరాబాద్‌లోని SAI హాస్టల్‌లో శిక్షణ పొందిన జ్యోతి, 2021 నుంచి ఒడిశాలో బ్రిటిష్ కోచ్ జేమ్స్ హిల్లియర్ ఆధ్వర్యంలో రిలయన్స్ సెంటర్‌లో శిక్షణ తీసుకుంటోంది. 2023 ఏషియన్ గేమ్స్‌లో రజతం, 2024 పారిస్ ఒలింపిక్స్‌లో తొలి భారతీయ మహిళా హర్డిలర్‌గా పాల్గొన్న ఆమె, 2025లో గోల్డ్ మెడల్ తో దేశం గర్వించదగ్గ ఎత్తుకు ఎదిగింది.

Next Story