Nandini Agasara : ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్.. హైదరాబాద్ అమ్మాయికి గోల్డ్ మెడల్

by Muthe.Rajitha |   (  Updated:2025-05-30 13:01:51  IST  )

ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్(Asian Athletics Championships 2025) లో హైదరాబాద్(Hyderabad) అమ్మాయి గోల్డ్ మెడల్ సాధించింది.

Nandini Agasara : ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్.. హైదరాబాద్ అమ్మాయికి గోల్డ్ మెడల్
X

దిశ, వెబ్ డెస్క్ : ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్(Asian Athletics Championships 2025) లో హైదరాబాద్(Hyderabad) అమ్మాయి గోల్డ్ మెడల్ సాధించింది. దక్షిణ కొరియా(South Korea)లోని గుమీలో జరిగిన 26వ ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ 2025లో సికింద్రాబాద్‌కు చెందిన నందిని అగసర(Nandini Agasara) మహిళల హెప్టాథ్లాన్ ఈవెంట్‌(Women's Heptathlon Event)లో సంచలన విజయం సాధించి గోల్డ్ మెడల్(Gold Medal) గెలుచుకుంది. ఈ పోటీలో ఆమె చివరి ఈవెంట్ అయిన 800 మీటర్ల పరుగులో 2:15.54 సమయంతో 885 పాయింట్లు సాధించి, మొత్తం 5941 పాయింట్లతో ఛాంపియన్‌గా నిలిచింది.

ఈ విజయంతో ఆమె భారతదేశం నుంచి హెప్టాథ్లాన్‌లో గోల్డ్ గెలిచిన మూడో మహిళగా (స్వప్నా బర్మన్ 2017, సోమా బిస్వాస్ 2005 తర్వాత) చరిత్ర సృష్టించింది. ఏడు ఈవెంట్‌లతో కూడిన హెప్టాథ్లాన్‌లో ఆమె జావెలిన్ థ్రోలో (34.18 మీటర్లు) వెనుకబడినప్పటికీ, చివరి 800 మీటర్ల పరుగులో 2:15.54 సమయంతో 885 పాయింట్లు సాధించి.. మొత్తం 5941 పాయింట్లతో గోల్డ్ మెడల్ సాధించింది.

Next Story