ఆసియా కప్ గెలిచేది ఆ జట్టే.. భారత మాజీ క్రికెటర్ జోస్యం

by Harish |

టీమిండియానే ఆసియా కప్ గెలుస్తుందని భారత మాజీ క్రికెటర్ మదన్‌లాల్ జోస్యం చెప్పాడు.

ఆసియా కప్ గెలిచేది ఆ జట్టే.. భారత మాజీ క్రికెటర్ జోస్యం
X

దిశ, స్పోర్ట్స్ : టీమిండియానే ఆసియా కప్ గెలుస్తుందని భారత మాజీ క్రికెటర్ మదన్‌లాల్ జోస్యం చెప్పాడు. ఓ జాతీయ మీడియాతో మదన్‌లాల్ మాట్లాడుతూ.. ఆసియా కప్‌లో భారత జట్టే బలమైన ఫేవరెట్ అని చెప్పాడు. భారత జట్టులో నైపుణ్యమైన ఆటగాళ్లు ఉన్నారని చెప్పాడు. అయితే, టీ20 ఫార్మాట్‌ను అంచనా వేయలేమన్నాడు. శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్ బలమైన పోటీదారులుగా కనిపిస్తున్నట్టు చెప్పాడు. అఫ్గాన్ నుంచి పాక్‌‌కు సవాల్ తప్పదన్నాడు. అలాగే, టీమిండియాకు మదన్‌లాల్ కీలక సూచన చేశాడు. స్పిన్నర్ కుల్దీప్‌ను తుది జట్టులోకి తీసుకోవాలని సూచించాడు. ‘కుల్దీప్ బౌలింగ్ శైలి ప్రత్యేకమైనది. టీ20 క్రికెట్‌లో అతన్ని ఎదుర్కోవడం కష్టం. అందుకే అతన్ని జట్టులోకి తీసుకోవాలి. పిచ్ కండీషన్స్, టీమ్ కాంబినేషన్‌పై తుది నిర్ణయం ఉంటుంది. దుబాయ్‌లో ఇద్దరు స్పిన్నర్లు, ముగ్గురు పేసర్లను ఎంపిక చేయొచ్చు.’అని మదన్ లాల్ చెప్పుకొచ్చాడు.


Next Story