- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేటి నుంచే ఆసియా కప్..హాట్ స్టార్ లో రాదు..ఉచితంగా ఎలా చూడాలంటే !
ఆసియా కప్ 2025 టోర్నమెంట్ ( Asia Cup 2025 ) ఇవాళ్టి నుంచే ప్రారంభం కానుంది. మరికొన్ని క్షణాల్లోనే ఆసియా కప్ 2025

దిశ, వెబ్ డెస్క్ : ఆసియా కప్ 2025 టోర్నమెంట్ ( Asia Cup 2025 ) ఇవాళ్టి నుంచే ప్రారంభం కానుంది. మరికొన్ని క్షణాల్లోనే ఆసియా కప్ 2025 టోర్నమెంట్ షురూ కానుంది. ఈ మేరకు ఆసియా కప్ కోసం అన్ని ఏర్పాట్లు యూఏఈలో జరిగాయి. ఇప్పటికే అన్ని జట్లు యూఏఈ చేరుకుని... మ్యాచ్ ల కోసం రెడీగా ఉన్నాయి. ఇక కాసేపటి క్రితమే... మొత్తం 8 జట్ల కెప్టెన్స్ కూడా ఫోటో షూట్ లో పాల్గొన్నారు. టీమిండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ కూడా ఇందులో ఉన్నారు. ఇవాళ్టి నుంచి సెప్టెంబర్ 28వ తేదీ వరకు ఆసియా కప్ 2025 టోర్నమెంట్ నిర్వహించనున్నారు.
ఈ మేరకు దుబాయ్, అబుదాబి స్టేడియాలను సిద్ధం చేశారు. భారత కాలమాన ప్రకారం... ఈ మ్యాచ్ లు రాత్రి 8 గంటలకు ప్రారంభం కానున్నాయి. అంటే అర్థరాత్రి వరకు మ్యాచ్ లు జరుగుతాయన్న మాట. ఆసియా కప్ 2025 టోర్నమెంట్ హాట్ స్టార్ లో రావడం లేదు. సోనీ స్పోర్ట్స్ 1, సోనీ స్పోర్ట్స్ 3 (హిందీ), సోనీ స్పోర్ట్స్ 4 (తెలుగు), సోనీ స్పోర్ట్స్ 4 (తమిళం),సోనీ స్పోర్ట్స్ 5 ఛానెల్స్ టీవీలలో వస్తే ఉచితంగానే చూసే ఛాన్స్ ఉంటుంది. సోనీ లివ్ యాప్ లో (sony liv app) చూడాలంటే.. రిఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. కాగా... ఇవాళ హంగాంగ్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య తొలి మ్యాచ్ జరుగనుంది.






