సూపర్-4కు చేరిన నాలుగు జట్లు..టీమిండియా ఆడే మ్యాచ్ లు ఇవే

by velandi.Saikiran |   (  Updated:2025-09-19 05:55:54  IST  )

సెప్టెంబర్ 21వ తేదీన టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య సూపర్ ఫోర్ జరగనుంది. ఈ మ్యాచ్ దుబాయ్ వేదికగా నిర్వహించనున్నారు

సూపర్-4కు చేరిన నాలుగు జట్లు..టీమిండియా ఆడే మ్యాచ్ లు ఇవే
X

దిశ‌, వెబ్ డెస్క్ : ఆసియా కప్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో గ్రూప్ దశ మ్యాచ్ లు అన్ని పూర్తయ్యాయి. ఇక సూపర్ 4 మ్యాచులు ప్రారంభం కానున్నాయి. టీమిండియా, శ్రీలంక, పాకిస్థాన్ , బంగ్లాదేశ్ జట్లు సూపర్ ఫోర్ లోకి దూసుకు వచ్చాయి. నిన్న ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ శ్రీలంక మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో అద్భుతంగా రాణించిన శ్రీలంక.... ఆఫ్ఘనిస్తాన్ జట్టును ఓడించింది.

ఈ తరుణంలోనే ఆఫ్ఘనిస్తాన్ ఇంటికి వెళ్ళగా శ్రీలంక సూపర్ ఫోర్ కు వచ్చింది. ఈ నెల 20వ తేదీ అంటే రేపటి నుంచి సూపర్ ఫోర్ రేస్ ప్రారంభమవుతుంది. రేపు శ్రీలంక వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య మొదటి సూపర్ ఫోర్ మ్యాచ్ జరగనుంది. అటు సెప్టెంబర్ 21వ తేదీన టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య సూపర్ ఫోర్ జరగనుంది. ఈ మ్యాచ్ దుబాయ్ వేదికగా నిర్వహించనున్నారు. ఇప్పటికే గ్రూప్ స్టేజిలో పాకిస్తాన్ ను ఓడించిన టీమిండియా... మరో పంచ్ ఇచ్చేందుకు సిద్ధమైంది.

Next Story