IND VS PAK: త్వరలోనే ఆసియా కప్.. భారత్-పాక్ మధ్య మ్యాచ్ ?

by velandi.Saikiran |

టీమిండియా ( Team India) వర్సెస్ పాకిస్తాన్ ( Pakisthan) మధ్య మరోసారి మ్యాచ్ జరిగే ఛాన్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏసి

IND VS PAK: త్వరలోనే ఆసియా కప్.. భారత్-పాక్ మధ్య మ్యాచ్ ?
X

దిశ, వెబ్ డెస్క్ : టీమిండియా ( Team India) వర్సెస్ పాకిస్తాన్ ( Pakisthan) మధ్య మరోసారి మ్యాచ్ జరిగే ఛాన్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏసియన్ క్రికెట్ కౌన్సిల్ (Asian Cricket Council - ACC) ఈ మేరకు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం అందుతుంది. 2025 ఆసియా కప్ టోర్నమెంట్ ను ఈ ఏడాది చివర లో నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు. టి20 ఫార్మాట్లో ఈ టోర్నమెంట్ జరిగే ఛాన్సులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్సీలో టీమిండియా అభ్యర్ధిలోకి దిగుతుంది అన్నమాట.

ఇక ఈ టోర్నమెంట్లో కేవలం 6 జట్లు మాత్రమే పాల్గొంటాయి. పాకిస్తాన్ అలాగే టీమిండియా, బంగ్లాదేశ్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ అలాగే యూఏఈ జట్లు తలపడబోతున్నాయి. ఇండియా అలాగే పాకిస్తాన్ రెండు జట్లు కూడా ఒకే గ్రూపులో ఉండే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయి. అయితే.. ఈ టోర్నమెంట్ మొత్తం యూఏఈ లో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. జులై మొదటి వారంలో ఏసియన్ క్రికెట్ కౌన్సిల్ (Asian Cricket Council - ACC) సభ్యులందరూ సమావేశమై... ఈ టోర్నమెంట్ కు సంబంధించిన షెడ్యూల్ పై చర్చ నిర్వహించబోతున్నారట.

అన్ని ఓకే అయితే సెప్టెంబర్ మాసంలో ఈ టోర్నమెంట్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే నెలలో ఈ టోర్నమెంట్ కు సంబంధించిన పూర్తిస్థాయి షెడ్యూల్ కూడా రిలీజ్ చేయనున్నారు. ఈ మేరకు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఒకవేళ పాకిస్తాన్ అలాగే ఇండియా మధ్య ఫైట్ ఉంటే.. ఆ రోజు జనాలు ఎక్కువగా మ్యాచ్ చూసే అవకాశాలు ఉన్నాయి. మొన్నటి యుద్ధం తర్వాత ఈ రెండు జట్లు.. మొదటిసారి తలబడతాయన్నమాట.

Next Story