శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీపై అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

టీమిండియా(Team India) టెస్టు జట్టు కెప్టెన్‌గా ప్రస్తుతం యువ బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్(Shubman Gill) వ్యవహరిస్తున్నారు.

శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీపై అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా(Team India) టెస్టు జట్టు కెప్టెన్‌గా ప్రస్తుతం యువ బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్(Shubman Gill) వ్యవహరిస్తున్నారు. తాజాగా గిల్ కెప్టెన్సీపై టీమిండియా మాజీ స్టార్ ఆల్ రౌండర్ అశ్విన్(Ravichandran Ashwin) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శుభ్‌మన్‌ గిల్‌ను నాయకుడిగా రాణిస్తూనే.. బ్యాట్‌మెన్‌గా కూడా అదరగొడుతున్నారని అన్నారు. రెండింటిపైనా ఫోకస్ చేసి ఫలితాలు రాబట్టడం చాలా అరుదు. కానీ గిల్ సాధ్యమే అని రూపిస్తున్నారు. గిల్‌ను కెప్టెన్‌గా చేస్తూ ప్రకటన వచ్చినప్పుడు.. మరెవరినైనా పరిశీలించాల్సిందని నేను చెప్పా. ఇప్పటికీ నేను అదే మాటకు కట్టుబడి ఉంటా. గిల్‌ను ఒకటి లేదా రెండేళ్లపాటు ఎవరికిందైనా ఉంచి సారథిగా మరింత మెరుగయ్యేలా చూస్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే గిల్‌కు నేరుగా ఛాన్స్‌ వచ్చింది. అప్పటివరకూ అతడికి ఇలాంటి బాధ్యతలు నిర్వర్తించిన గొప్ప అనుభవం లేదు. ఫ్యూచర్‌లో అన్ని విధాలుగా రాణించాలంటే సీనియర్ల కింద కొన్నాళ్లు చేయడం చాలా అవసరం అని అశ్విన్‌ వెల్లడించాడు.

Next Story