- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కెప్టెన్‌ను అలా ఎందుకు ఎంపిక చేయొద్దు.. బీసీసీఐకి కీలక సూచన చేసిన అశ్విన్
భారత టెస్టు కెప్టెన్ ఎవరు? అనే విషయంపై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది.

దిశ, స్పోర్ట్స్ : భారత టెస్టు కెప్టెన్ ఎవరు? అనే విషయంపై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ పేరు ప్రధానంగా వినిపిస్తున్నా.. స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రాకు పగ్గాలు అప్పగించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ కూడా రేసులో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. తాజాగా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ కొత్త పేరును ప్రతిపాదించాడు. బుమ్రాతోపాటు సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను కూడా పరిగణలోకి తీసుకోవాలన్నాడు.
‘అందరూ గిలే కెప్టెన్ అని అంటున్నారు. కానీ, బుమ్రా భారీ ఆప్షన్. అయితే, మనం రవీంద్ర జడేజాను ఎందుకు మర్చిపోతున్నాం. కొత్త వ్యక్తిని సారథిగా నియమించాలనుకుంటే అతనికి పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగించడానికి ముందు అనుభవజ్ఞుడైన ఆటగాడి కింద రెండేళ్లు ఎందుకు పని చేయకూడదని నా అభిప్రాయం.’ అని చెప్పాడు.
ఈ సందర్భంగా కీలక సూచన చేశాడు. ముగ్గురు లేదా నలుగురిని ఎంపిక చేసి వారిని ప్రెజెంటేషన్ ఇవ్వమని, జట్టుకు సంబంధించి తమ విజన్‌ను వివరించమని చెప్పాలన్నాడు. ఆస్ట్రేలియాలో ఇలాగే జరుగుతుందని, మనం ఎందుకు అలా చేయొద్దని ప్రశ్నించాడు. సారథిగా బుమ్రాను సీరియస్‌గా పరిగణలోకి తీసుకోవాలని, వెన్ను నొప్పి అడ్డంకి కాకూడదన్నాడు. బుమ్రా మన జాతీయ నిధి అని చెప్పాడు. కమిన్స్‌కు వెన్ను గాయం ఉన్నప్పటికీ టెస్టులు, వన్డేలలో ఆస్ట్రేలియాకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న విషయాన్ని గుర్తు చేశాడు.






