Ashes series: డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్ లో దొరికిన ఇంగ్లాండ్ స్టార్ !

by velandi.Saikiran |

యాషెస్‌ సిరీస్ 2025-26 చాలా రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ లో భాగంగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లు

Ashes series: డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్ లో దొరికిన ఇంగ్లాండ్ స్టార్ !
X

దిశ‌, వెబ్ డెస్క్‌: యాషెస్‌ సిరీస్ 2025-26 చాలా రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ లో భాగంగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లు తలపడుతున్నాయి. ఇప్పటికే ఈ రెండు జట్ల మధ్య మూడు టెస్టులు పూర్తయ్యాయి. ఇందులో వరుసగా మూడు టెస్టుల్లో ఆస్ట్రేలియా గెలిచి, సిరీస్ కైవసం చేసుకుంది. ఇక 4వ టెస్ట్ డిసెంబర్ 26వ తేదీ నుంచి ప్రారంభం కానుంది.

ఇది ఇలా ఉండగా మూడో టెస్ట్ కంటే ముందే, కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు బెన్ డకెట్ ( Ben Duckett ) డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లో దొరికాడట. పీకల దాకా తాగి ఆస్ట్రేలియా వీధుల్లో తిరిగాడట బెన్ డకెట్. దీంతో ఆస్ట్రేలియా పోలీసులు అతన్ని పట్టుకొని, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇందులో బెన్ డకెట్ తాగినట్లు తేలడంతో, కేసు పెట్టినట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇక ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story