- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ashes: బాక్సింగ్ డే టెస్ట్‌లో సంచలనం.. ఒకేరోజు నేలకూలిన 20 వికెట్లు
యాషెస్ సిరీస్‌లో భాగంగా మెల్‌బోర్న్ (Melbourne) వేదికగా ఆస్ట్రేలియా (Australia), ఇంగ్లాండ్ (England) మధ్య జరుగుతున్న బాక్సింగ్ డే టెస్ట్‌లో సంచలన నమోదైంది.

దిశ, వెబ్‌డెస్క్: యాషెస్ సిరీస్‌లో భాగంగా మెల్‌బోర్న్ (Melbourne) వేదికగా ఆస్ట్రేలియా (Australia), ఇంగ్లాండ్ (England) మధ్య జరుగుతున్న బాక్సింగ్ డే టెస్ట్‌లో సంచలన నమోదైంది. ఒకే రోజు 20 వికెట్లు నేలకూలాయి. ఇంగ్లాండ్ తన తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 29.5 ఓవర్లలోనే 110 పరుగులకు కుప్పకూలింది. 42 పరుగుల వెనకంజలో ఉంది. ఈ మ్యాచ్‌లో ఆసీస్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 152 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే. ఇంగ్లాండ్ బ్యట్స్‌మెన్లలో హ్యారీ బ్రూక్ (Harry Brook) ఒక్కడే 41, గస్ అట్కిన్సన్ (Gus Atkinson) 28 పరుగులు చేశారు. మిగతా వారంతా వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఇక ఆసీస్ బౌలర్లలో మైఖేల్ నెసర్ 4, స్కాట్ బోల్యాండ్ 3, మిచెల్ స్టార్క్ 2, కామెరూన్ గ్రీన్ ఒక వికెట్ తీసుకున్నారు. ఆ తర్వాత సెకెండ్ ఇన్నింగ్స్ ఆరంభించి ఆస్ట్రేలియా తొలి రోజు ఆటముగిసే సమయానికి ఒక ఓవర్‌కు వికెట్ నష్టపోకుండా 4 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్, స్కాట్ బోల్యాండ్ క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం కంగారు జట్టు 46 పరుగుల ఆధిక్యంలో ఉంది.






